LOADING...
Stock market: ఆఖరి గంటలో అమ్మకాల ఒత్తిడి.. 64 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌, 27 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ
ఆఖరి గంటలో అమ్మకాల ఒత్తిడి..

Stock market: ఆఖరి గంటలో అమ్మకాల ఒత్తిడి.. 64 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌, 27 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2026
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం తీవ్ర ఒడిదొడుకుల మధ్య మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. ఉదయం మెటల్‌, పీఎస్‌యూ బ్యాంకింగ్‌, రియాల్టీ రంగాల షేర్ల మద్దతుతో లాభాల్లో దూసుకెళ్లిన ప్రధాన సూచీలు.. ట్రేడింగ్‌ చివరి గంటలో భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో రోజంతా నమోదైన లాభాల్లో ఎక్కువ భాగం ఆవిరైంది. సెన్సెక్స్‌ 73,988.27 పాయింట్ల వద్ద ప్రారంభమై, ఇంట్రాడేలో 74,613.01 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. అయితే చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 600 పాయింట్లు వెనక్కి తగ్గి, చివరకు 64 పాయింట్ల స్వల్ప లాభంతో 73,983.18 వద్ద ముగిసింది.

వివరాలు 

బ్రెంట్‌ క్రూడ్‌ ముడి చమురు బ్యారెల్‌ ధర 91.44 డాలర్లు 

మరోవైపు నిఫ్టీ కూడా ఉదయం లాభాల్లో ట్రేడైనప్పటికీ ఆ ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. చివరకు 27.15 పాయింట్లు నష్టపోయి 23,214.95 వద్ద స్థిరపడింది. విదేశీ మారక మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.95.27 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌లోని 30 ప్రధాన షేర్లలో ఎటర్నల్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటాన్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో ముగిశాయి. మరోవైపు హిందుస్థాన్‌ యూనిలీవర్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ షేర్లు లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లలో బ్రెంట్‌ క్రూడ్‌ ముడి చమురు బ్యారెల్‌ ధర 91.44 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు ధర 4,167 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Advertisement