Loading...
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. 777 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. 777 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. 777 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2026
04:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో చమురు ధరలు పెరగడం, అమెరికా బాండ్‌ రాబడులు ఎగబాకడం మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. ముఖ్యంగా మెటల్‌, రియాల్టీ, కెమికల్‌ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు గణనీయంగా పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 777 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 279 పాయింట్లు కోల్పోయింది.

వివరాలు 

1400 పాయింట్ల వరకు పతనం

సెన్సెక్స్‌ ఉదయం 75,369.63 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది.

క్రితం ముగింపు 74,781.76 పాయింట్లతో పోలిస్తే ఇది మెరుగైన స్థాయి. అయితే, కొద్దిసేపటికే సూచీ నష్టాల్లోకి జారుకుంది.

రోజంతా ప్రతికూల ధోరణిలోనే కదలాడిన సెన్సెక్స్‌.. ఇంట్రాడేలో ఓ దశలో 1,400 పాయింట్ల వరకు పతనమైంది.

చివరికి 777.94 పాయింట్ల నష్టంతో 74,003.82 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా ఇదే బాటలో పయనించింది.

279.50 పాయింట్లు కోల్పోయి 23,118.60 వద్ద ముగిసింది. మరోవైపు, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.96గా నమోదైంది.

వివరాలు 

ఈ షేర్లలో భారీ క్షీణత

సెన్సెక్స్‌ 30 సూచీలో బీఈఎల్‌, ఇండిగో, టైటాన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అదానీ పోర్ట్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.

అయితే, హెచ్‌సీఎల్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హిందుస్థాన్‌ యునిలీవర్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 107.40 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు, బంగారం ఔన్సు ధర 4,273.11 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ADVERTISEMENT