Page Loader
Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు.. ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 
ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు.. ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2025
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం రోజున స్థిరంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ, భారత మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 74 పాయింట్ల లాభంతో 82,446 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 25,131 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో భాగమైన 30 ప్రధాన షేర్లలో ఎంఅండ్‌ఎం,రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌,ఎటర్నల్‌,హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌,భారతీ ఎయిర్‌టెల్‌,ఎన్టీపీసీ,యాక్సిస్‌ బ్యాంక్‌,ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌ వంటి కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇకపోతే, కోటక్ మహీంద్రా బ్యాంక్‌, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టైటాన్‌, టెక్ మహీంద్రా, టీసీఎస్‌, అదానీ పోర్ట్స్‌, ఎల్అండ్‌టీ, ఐటీసీ వంటి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

వివరాలు 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ప్రతి బ్యారెల్‌కు 66.75 డాలర్లు

విదేశీ మారకద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ డాలరుతో పోలిస్తే 85.48 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ప్రతి బ్యారెల్‌కు 66.75 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ధర ఔన్సు కొలమానంలో 3,359 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అమెరికా స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. నాస్‌డాక్‌ సూచీ 0.63 శాతం పెరిగింది, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.55 శాతం లాభపడగా, డో జోన్స్ సూచీ 0.25 శాతం పెరిగింది. ఇదే బాటలో ఆసియా మార్కెట్లు కూడా బుధవారం లాభాల దిశగా పయనించాయి.

వివరాలు 

రూ.2,302 కోట్ల విలువైన షేర్ల కొనుగోలు

జపాన్ నిక్కీ సూచీ 0.45 శాతం, ఆస్ట్రేలియా ASX 0.28 శాతం, హాంగ్‌సెంగ్‌ 0.87 శాతం, షాంఘై సూచీ 0.47 శాతం లాభాలను నమోదుచేశాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) వరుసగా మూడో రోజూ కొనుగోళ్లలో పాల్గొన్నారు. మంగళవారం ఒక్కరోజే రూ.2,302 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అంతేకాకుండా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) కూడా అదే రోజున నికరంగా రూ.1,113 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు సమాచారం.