Page Loader
Stock Market: లాభాల్లో కొనసాగుతోన్న దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 25,140
Stock Market: లాభాల్లో కొనసాగుతోన్న దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 25,140

Stock Market: లాభాల్లో కొనసాగుతోన్న దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 25,140

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 15, 2025
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, కనిష్ఠ స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడం వల్ల నేటి ట్రేడింగ్‌లో దేశీయ సూచీలు పురోగతిని నమోదు చేశాయి. ఐటీ రంగ షేర్లపై విక్రయాల ఒత్తడి కొనసాగడంతో పాటు, విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్‌ఐఐలు) అమ్మకాల ప్రభావంతో నిన్న మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆ నష్టాల నుండి నేడు కొంత మేర కోలుకోవడంలో విజయవంతమయ్యాయి.

వివరాలు 

భారత రూపాయి మారక రేటు 85.97గా నమోదు 

ఉదయం 9.30 గంటల సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్‌ 175 పాయింట్ల లాభంతో 82,425 వద్ద ట్రేడవుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 25,140 వద్ద కొనసాగుతోంది. అమెరికన్ డాలర్‌తో పోల్చితే భారత రూపాయి మారక రేటు 85.97గా నమోదైంది. నిఫ్టీ సూచీలో హీరో మోటార్ కార్ప్ లిమిటెడ్‌,గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, భారత్ ఎలక్ట్రానిక్స్‌, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాలను నమోదు చేస్తున్నాయి. మరోవైపు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, సిప్లా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌, టాటా స్టీల్‌, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిన్న అమెరికాలో స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగియగా, అదే పాజిటివ్ ట్రెండ్ నేటి ఆసియా మార్కెట్లలోనూ కనిపిస్తోంది.