LOADING...
Stock Market Today: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,821
లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,821

Stock Market Today: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,821

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2025
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. గత మూడు రోజులుగా సాగిన నష్టాలకు ఈ రోజు బ్రేక్ పడింది. ముఖ్యంగా రియల్టీ, ఫార్మా రంగాల ప్రదర్శన సూచీలకు మద్దతుగా నిలిచింది. ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 80,973.25 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ సమయంలో ఒక దశలో ఇది 80,665కి పడిపోయినా, అనంతరం 446 పాయింట్లు పెరిగి 81,328 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ కూడా 140 పాయింట్ల లాభంతో 24,821 వద్ద స్థిరంగా ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 15 పైసలు పడిపోయి 86.82గా నమోదైంది.

వివరాలు 

ఐటీ, లోహ,రియల్టీ రంగాల్లో మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి 

నిఫ్టీలో జియో ఫైనాన్షియల్, లార్సెన్, రిలయన్స్, ఆసియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్ షేర్లు మంచి లాభాలు నమోదు చేశాయి. అయితే ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టైటాన్ కంపెనీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, లోహ,రియల్టీ రంగాల్లో మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడం మార్కెట్లకు దన్నుగా మారింది. మార్కెట్‌లోని అస్థిరత స్థాయిని సూచించే వోలటిలిటీ ఇండెక్స్ (VIX) 2.9 శాతం తగ్గింది. అమెరికా మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కానున్నాయనే అంచనాలు కూడా మన మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపించాయి.