
Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 70 పాయింట్లు, నిఫ్టీ 7 పాయింట్ల లాభం
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిసాయి. ఉదయం మార్కెట్ లాభాలతో ప్రారంభమైనా, రోజంతా చిన్న పరిధిలోనే హెచ్చుతగ్గులు నమోదయ్యాయి.
కొన్ని ఎంపిక చేయబడిన షేర్లను తప్పితే, మిగిలిన మార్కెట్‌లో కొనుగోళ్ల ఉత్సాహం కనిపించలేదు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్‌ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లలో విక్రయాలు చోటుచేసుకోగా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ షేర్ల లాభాలు సూచీలను మద్దతుగా నిలిపాయి.
ఆసియా మార్కెట్లు కూడా ఈ రోజు మిశ్రమ ధోరణిలో కదలాడాయి.
సెన్సెక్స్ సూచీ ఈరోజు ఉదయం 80,396.92 పాయింట్ల వద్ద, గత ముగింపు స్థాయైన 80,218.37 పాయింట్లను మించి లాభాల్లో ప్రారంభమైంది.
వివరాలు
డాలరుతో రూపాయి మారక విలువ 85.25
ఇంట్రాడే వ్యాపారంలో 80,122.02 నుంచి 80,661.31 పాయింట్ల మధ్య ఒడిదొడుకులకు లోనైంది.
చివరకు సెన్సెక్స్ 70.01 పాయింట్ల స్వల్ప లాభంతో 80,288.38 వద్ద ముగిసింది.
నిఫ్టీ సూచీ 7.45 పాయింట్ల లాభంతో 24,335.95 వద్ద స్థిరంగా ముగిసింది. ఈ రోజు డాలరుతో రూపాయి మారక విలువ 85.25గా నమోదైంది.
సెన్సెక్స్‌లో అంతర్భూతమై ఉన్న 30 ప్రధాన షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు వరుసగా రెండో రోజు 2.20 శాతం లాభంతో ముగియడం గమనార్హం.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 64 డాలర్లు
టెక్ మహీంద్రా,ఎటర్నల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ షేర్లు కూడా లాభాల బాట పట్టాయి. అయితే, అల్ట్రాటెక్ సిమెంట్, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాలు చవిచూశాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 64 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 3,322 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.