
Stock Market : వరుస లాభాలకు బ్రేక్.. ప్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు స్థిరంగా ముగిశాయి. గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో లాభాలతో ముగిసిన నేపథ్యంలో, మదుపరులు లాభాల స్వీకరణకు ముందుకు రావడం మార్కెట్లలో అస్థిరతకు కారణమైంది. గత సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 82,643.73 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. అయితే, కొద్దిసేపటికే మార్కెట్లు ఒడిదొడుకులకు లోనయ్యాయి. ట్రేడింగ్ మధ్యలో సెన్సెక్స్ 82,680.79 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరగా, అతి తక్కువగా 82,240.40 పాయింట్లకు పడిపోయింది. చివరికి ఇది 53.49 పాయింట్లు కోల్పోయి 82,391.72 పాయింట్ల వద్ద స్థిరపడింది.
వివరాలు
దాదాపు 1 శాతం లాభాన్ని నమోదు చేసిన పవర్ ఇండెక్స్
నిఫ్టీ మాత్రం స్వల్పంగా 1.05 పాయింట్లు పెరిగి 25,104.25 పాయింట్ల వద్ద ముగిసింది. రోజంతా ట్రేడింగ్‌లో సుమారుగా 2,160 షేర్ల విలువ పెరిగినట్లే,మరో 1,723 షేర్లు దిగజారినట్లు నమోదైంది. నిఫ్టీ సూచీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్,టెక్ మహీంద్రా,టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు లాభాలు పొందగా,ట్రెంట్, ఆసియన్ పెయింట్స్,బజాజ్ ఫైనాన్స్,టాటా స్టీల్,బజాజ్ ఫిన్‌సర్వ్ నష్టాల్లో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే,రియాల్టీ ఇండెక్స్ శాతం మేర వెనకపడగా, ఐటీ ఇండెక్స్ 1.7 శాతం లాభపడింది. మీడియా ఇండెక్స్ 1 శాతం పెరిగినట్లుగా కనిపించింది. పవర్ ఇండెక్స్ సైతం దాదాపు 1 శాతం లాభాన్ని నమోదు చేసింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సూచీ స్థిరంగా ముగియగా, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచీ 0.3 శాతం మేర పెరిగింది.