LOADING...
SHEIN : అమెరికా ఫ్యాషన్ బ్రాండ్ ఎవర్‌లేన్‌ను కొనుగోలు చేస్తున్న షీన్.. రూ.100 మిలియన్ డీల్
అమెరికా ఫ్యాషన్ బ్రాండ్ ఎవర్‌లేన్‌ను కొనుగోలు చేస్తున్న షీన్.. రూ.100 మిలియన్ డీల్

SHEIN : అమెరికా ఫ్యాషన్ బ్రాండ్ ఎవర్‌లేన్‌ను కొనుగోలు చేస్తున్న షీన్.. రూ.100 మిలియన్ డీల్

వ్రాసిన వారు Sirish Praharaju
May 18, 2026
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనా ఈ-కామర్స్ దిగ్గజం SHEIN అమెరికాకు చెందిన దుస్తుల బ్రాండ్ ఎవర్‌లేన్‌ను కొనుగోలు చేయనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఎవర్‌లేన్‌లో మెజారిటీ వాటా కలిగిన L Catterton నుంచి ఈ డీల్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం విలువ దాదాపు 100 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు 'పక్', 'ది ఇన్ఫర్మేషన్' నివేదికలు పేర్కొన్నాయి. ఒకప్పుడు ఈ-కామర్స్ రంగం జోరుగా ఉన్న సమయంలో భారీ విలువ దక్కించుకున్న ఎవర్‌లేన్.. ఇప్పుడు తక్కువ విలువకే అమ్ముడవుతోంది. సాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఎవర్‌లేన్ బోర్డు ఈ కొనుగోలు ఒప్పందానికి ఇప్పటికే ఆమోదం తెలిపినట్లు సమాచారం.

వివరాలు 

అప్పుల భారం కారణంగా కంపెనీ ఆర్థిక ఇబ్బందులు

అయితే ఈ డీల్‌లో నగదు లావాదేవీలు ఉంటాయా? లేక షేర్ల రూపంలో చెల్లింపులు జరగనున్నాయా? అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ముఖ్యంగా కామన్ స్టాక్ హోల్డర్లకు ఎలాంటి చెల్లింపులు ఉండవని ఆదివారం షేర్‌హోల్డర్లకు పంపిన నోట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. 'క్వైట్ లగ్జరీ' స్టైల్‌తో గుర్తింపు పొందిన ఎవర్‌లేన్ బ్రాండ్‌ను మేఘన్ మార్కల్ వంటి ప్రముఖులు కూడా ఇష్టపడుతుంటారు. అయితే ఇటీవల పెరుగుతున్న అప్పుల భారం కారణంగా కంపెనీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మరోవైపు అమెరికా టారిఫ్‌ల ప్రభావంతో ఒత్తిడి ఎదుర్కొంటున్న షీన్.. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా గత ఏడాది నుంచి ఇతర ఫ్యాషన్ బ్రాండ్లకు చైనాలోని తన తయారీ నెట్‌వర్క్‌ను సేవల రూపంలో అందించడం ప్రారంభించింది.

Advertisement