LOADING...
Gold, Silver Rates: అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.4లక్షలు దాటి పరుగులు
అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.4లక్షలు దాటి పరుగులు

Gold, Silver Rates: అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.4లక్షలు దాటి పరుగులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2026
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ మార్కెట్లో బంగారం,వెండి ధరలు ఆకాశాన్నిఅంటుతున్నాయి. బంగారం ధర రూ.2 లక్షల పరిధికి చేరగా, వెండి ధర ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఏకంగా రూ.4 లక్షలకు పైగా చేరి అన్ని రకాల రికార్డులను సృష్టించింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో ఉదయం 10 గంటల వద్ద 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1,85,000 దాటింది. అదే సమయంలో వెండి ధర రూ.4,00,000కి చేరింది. హైదరాబాద్‌లో బుధవారం రాత్రి 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,73,300గా ఉండగా, కొన్ని గంటల్లోనే రూ.12వేలు పెరగడం గమనార్హం. కిలో వెండి ధర రూ.3,79,700గా ముగియగా,నేటి రోజు ఇది రూ.21,000కి పైగా పెరిగింది.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం,వెండి ధరలు రికార్డు స్థాయికి

మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో మార్చి డెలివరీ ఫ్యూచర్స్‌లో వెండి ధర ఒక్క రోజులోనే రూ.22,090 పెరిగి రూ.4,07,456కు చేరి కొత్త జీవితకాల రికార్డును తాకింది. ఫిబ్రవరి డెలివరీ బంగారం ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర కూడా రూ.14,586 పెరిగి రూ.1,80,501కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం,వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. వెండి ధర మొదటిసారిగా 5,600 డాలర్ల మార్క్‌ను దాటింది.

వివరాలు 

ఔన్సు వెండి ధర 119.51 డాలర్లకు..

కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో ఏప్రిల్ డెలివరీ వెండి ధర 5,626.8 డాలర్లుగా నమోదైంది. ఔన్సు వెండి ధర 119.51 డాలర్లకు చేరింది. అమెరికా డాలర్ బలహీనపడటం, వెండి కోసం పరిశ్రమల డిమాండ్ పెరగడం వల్ల వైట్ గోల్డ్‌కు భారీ మద్దతు లభించిందని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా, అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ అస్థిరతల కారణంగా మదుపర్లు బంగారం, వెండిని సురక్షిత పెట్టుబడి మార్గంగా పరిగణించడం కూడా ధరల పెరుగుదలకు కారణమై ఉంది.

Advertisement