Silver Rates: సంక్రాంతి ముందే షాక్ ఇచ్చిన వెండి ధర ! ఈరోజు ఎంత పెరిగిందంటే..!
ఈ వార్తాకథనం ఏంటి
వెండి ధర మరోసారి మార్కెట్‌ను కుదిపేస్తోంది.గత ఏడాది భారీగా పెరిగి సంచలనం సృష్టించిన వెండి ధరలు.. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఈ వారం ఆరంభంలోనే వెండికి గట్టిపోటు ఎదురవడంతో ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. ఈరోజు ఒక్కరోజులోనే కిలో వెండి ధరపై రూ.10,000 పెరుగుదల నమోదైంది. అదే సమయంలో తులం బంగారం ధర కూడా రూ.1,690 పెరగడంతో కొనుగోలుదారులు షాక్‌కు గురవుతున్నారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో వెండి ధరలు మరింత వేడెక్కుతున్నాయి. ఈరోజు కిలో వెండి ధర ఏకంగా రూ.10,000 పెరగడంతో చరిత్రలోనే రికార్డు స్థాయిలను తాకుతోంది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,70,000 సమీపంలో అమ్ముడవుతోంది.
వివరాలు
వెండి ధర రూ.3 లక్షల మార్క్‌ను చేరే అవకాశాలు
హైదరాబాద్,చెన్నైమార్కెట్లలో మాత్రం కిలో వెండి ధర రూ.2,87,000 వరకు ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ,ముంబై, కోల్‌కతా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,70,000 దగ్గర కొనసాగుతోంది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం త్వరలోనే వెండి ధర రూ.3 లక్షల మార్క్‌ను చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బంగారం ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఈరోజు తులం బంగారం ధరపై రూ.1,690 పెరుగుదల నమోదవగా, బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,150 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,550 పెరిగి రూ.1,30,300కు చేరింది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,270 పెరుగుదలతో రూ.1,06,610 వద్ద అమ్ముడవుతోంది.