Page Loader
Gold and Silver Cost Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప ఊరట.. తాజా రేట్లు ఇవే!
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప ఊరట.. తాజా రేట్లు ఇవే!

Gold and Silver Cost Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప ఊరట.. తాజా రేట్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2025
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయులు బంగారం, వెండిని ఆర్ధిక భద్రతగా భావిస్తారు. పండుగలు, పర్వదినాలు, వివాహాలు వంటి శుభ సందర్భాల్లో పసిడిని కొనుగోలు చేయడం ఓ సంప్రదాయంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగినా, దేశీయంగా ఆల్ టైం హై స్థాయికి చేరుకున్నా కూడా బంగారానికి డిమాండ్ తగ్గే ప్రసక్తే లేదు. కానీ, ప్రస్తుతం బంగారం కొనాలనుకునే వారికి గట్టి షాక్ తగిలింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తత, ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు, ఆర్థిక అస్థిరతలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాలతో పసిడి రేటు అంతకంతకూ పెరిగిపోతోంది. గత వారం దేశీయంగా బంగారం ధర రూ.3,750 వరకు పెరిగింది.

Details

తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు 

అయితే, ఈ రోజు మాత్రం స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర తులానికి (10 గ్రాములు) రూ.93,190కి చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర తులానికి రూ.1,01,670గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, వరంగల్, పొద్దుటూరు వంటి నగరాల్లో కూడా ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి. ఇతర ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి ఢిల్లీ 22 క్యారెట్ల ధర: రూ.93,340 24 క్యారెట్ల ధర: రూ.1,01,820 ముంబై 22 క్యారెట్ల ధర: రూ.93,190 24 క్యారెట్ల ధర: రూ.1,01,670 చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, కేరళ నగరాల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

Details

వెండి ధరల పరిస్థితి 

బంగారం ధరలు ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ రేట్లు, ద్రవ్యోల్బణం స్థాయి, కేంద్ర బ్యాంకుల బంగారు నిల్వలు, వడ్డీ రేట్ల మార్పులు, ఆభరణాల మార్కెట్లపై ఆధారపడి ఉంటాయి నేటి కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,09,900గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ ఇదే స్థాయిలో ధరలు ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ.. భారతీయుల ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆభరణాల కొనుగోలు సీజన్ అయినందున, ధరలపై రోజువారీ ట్రెండ్స్‌పై నిత్యం కళ్లవేసి ఉండాల్సిన అవసరం ఉంది.