Credit score: సాఫ్ట్ ఎంక్వైరీ vs హార్డ్ ఎంక్వైరీ.. రుణం తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
బ్యాంకుల నుంచి రుణం పొందాలంటే, తక్కువ వడ్డీకే లోన్ దొరకాలంటే మెరుగైన క్రెడిట్ స్కోరు తప్పనిసరి.
అయితే క్రెడిట్ స్కోరును పెంచుకోవడమే కాకుండా తగ్గకుండా నిర్వహించుకోవడం కూడా చాలా అవసరం.
ఈ నేపథ్యంలో 'సాఫ్ట్ ఎంక్వైరీ' (Soft Inquiry), 'హార్డ్ ఎంక్వైరీ' (Hard Inquiry) అనే రెండు పదాలు తరచుగా వినిపిస్తుంటాయి.
వీటి వల్ల క్రెడిట్ స్కోరుపై ఎంత ప్రభావం పడుతుంది? అవి ఏమిటో తెలుసుకోవాలి.
Details
సాఫ్ట్ ఎంక్వైరీ అంటే?
ఒక వ్యక్తి ఆర్థిక స్థితిగతులను క్రెడిట్ నివేదిక, స్కోరు ద్వారా తెలుసుకోవచ్చు. సాధారణంగా క్రెడిట్ స్కోరు 750కు పైగా ఉంటే అది మంచి స్కోరుగా పరిగణిస్తారు.
ఈ స్కోరును చూసుకోవడాన్ని 'సాఫ్ట్ ఎంక్వైరీ' అంటారు. ప్రీ-అప్రూవ్డ్ లేదా ప్రీ-క్వాలిఫైడ్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, ఎంప్లాయిమెంట్ బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్ వంటివి ఈ కేటగిరీలోకి వస్తాయి.
సాఫ్ట్ ఎంక్వైరీ వల్ల క్రెడిట్ స్కోరు తగ్గదు.
Details
హార్డ్ ఎంక్వైరీ అంటే?
బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి రుణం లేదా క్రెడిట్ కార్డు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఆ సంస్థ మీ క్రెడిట్ స్కోరును పరిశీలిస్తుంది. దీన్నే 'హార్డ్ ఎంక్వైరీ' అంటారు.
వాహన రుణం, గృహ రుణం, వ్యక్తిగత రుణాల కోసం చేసిన దరఖాస్తులు దీనిలోకి వస్తాయి.
హార్డ్ ఎంక్వైరీ మీరు రుణం కోసం ప్రయత్నిస్తున్నట్లు సూచిస్తుంది. ప్రతి హార్డ్ ఎంక్వైరీ క్రెడిట్ రిపోర్ట్‌లో నమోదవుతుంది.
పదే పదే రుణం కోసం దరఖాస్తు చేస్తే, క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
Details
హార్డ్ ఎంక్వైరీ వల్ల క్రెడిట్ స్కోరుపై ప్రభావం
సాధారణంగా హార్డ్ ఎంక్వైరీ వల్ల క్రెడిట్ స్కోరు 5-10 పాయింట్లు తగ్గవచ్చు.
తక్కువ సమయంలో పదే పదే రుణానికి దరఖాస్తు చేస్తే స్కోరు వేగంగా పడిపోతుంది.
క్రెడిట్ రిపోర్ట్‌లో ఈ హార్డ్ ఎంక్వైరీ డేటా దీర్ఘకాలం పాటు కనిపిస్తుంది.
హార్డ్ ఎంక్వైరీ ప్రభావం తగ్గించుకోవాలంటే?
అవసరమైనప్పుడు మాత్రమే రుణం లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయాలి.
ఒక్కో దరఖాస్తుకు మధ్య కనీసం 3-6 నెలల గ్యాప్ ఇవ్వాలి.
ప్రీ-అప్రూవ్డ్ రుణాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని సాఫ్ట్ ఎంక్వైరీ ద్వారా ముందుగా పరిశీలించాలి.
కేవలం బోనస్ లేదా రివార్డుల కోసం కొత్త క్రెడిట్ కార్డు దరఖాస్తు చేయడం మంచిది కాదు.
Details
క్రెడిట్ స్కోరును తనిఖీ చేసుకోవాలి
ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోరును తనిఖీ చేసుకోవడం చాలా అవసరం.
ఏడాదికి ఒకసారి ఉచితంగా క్రెడిట్ స్కోరు చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనకు తెలియకుండానే మన పేరుతో ఎవరో రుణం తీసుకుని ఉంటే, క్రెడిట్ రిపోర్ట్ ద్వారా వాటిని గుర్తించి వెంటనే బ్యాంకులకు ఫిర్యాదు చేయడం ద్వారా సమస్యను నివారించుకోవచ్చు.