Page Loader
Adani group: దూసుకుపోయిన అదానీ గ్రూప్ షేర్లు.. రూ.13.3 లక్షల కోట్లు దాటిన కంపెనీ విలువ 
Adani group: దూసుకుపోయిన అదానీ గ్రూప్ షేర్లు.. రూ.13.3 లక్షల కోట్లు దాటిన కంపెనీ విలువ

Adani group: దూసుకుపోయిన అదానీ గ్రూప్ షేర్లు.. రూ.13.3 లక్షల కోట్లు దాటిన కంపెనీ విలువ 

వ్రాసిన వారు Stalin
Dec 05, 2023
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్లు మంగళవారం కూడా స్టాక్ మార్కెట్‌లో దూసుకుపోయాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్‌లలో అప్పర్ సర్క్యూట్ కొట్టాయి. గత మూడు రోజులు అదానీ షేర్లు భారీ పెరుగుదలతో ట్రేడవుతున్నాయి. అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో యూఎస్ గ్రూప్ కూడా క్లీన్ చిట్ ఇవ్వడంతో అదానీ షేర్లు ఈ రోజు కూడా రాణించాయి. ఈ క్రమంలో అదానీ షేర్ల మార్కెట్ క్యాప్ మంగళవారానికి రూ.13లక్షల కోట్లను దాటింది. అదానీ షేర్లు సోమవారం కూడా భారీగా రాణించగా.. మార్కెట్ క్యాప్ రూ.73,305కోట్లు పెరిగి, మొత్తం రూ.11,93,255 కోట్లకు చేరుకుంది. తాజాగా రూ.13 లక్షల కోట్లు దాటింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అదానీ గ్రూప్‌కు యూఎస్ ఏజెన్సీ క్లీన్ చిట్