SpiceJet Dubai Airport: స్పైస్‌జెట్‌కు భారీ షాక్.. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో చెక్-ఇన్ బంద్
ఈ వార్తాకథనం ఏంటి
స్పైస్ జెట్‌కు దుబాయ్‌లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సుమారు రూ.35.85 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సంస్థ స్పైస్‌జెట్ చెక్-ఇన్ సేవలను నిలిపివేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్, అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయాలను నిర్వహించే సంస్థ ఈ నిర్ణయాన్ని నవంబర్ 12 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. బకాయిలు దాదాపు 14 మిలియన్ యూఏఈ దిర్హామ్‌లకు చేరినట్లు సమాచారం.
Details
నాలుగు విమానాలు రద్దు
ఈ పరిణామం కారణంగా అమృత్‌సర్, జైపూర్, ముంబై, ఢిల్లీకి వెళ్లాల్సిన నాలుగు స్పైస్‌జెట్ విమానాలు రద్దయ్యాయి.
ప్రయాణికులను తీసుకెళ్లకుండా వాటిని ఫెర్రీ సర్వీసులుగా నడిపించే పరిస్థితి ఏర్పడింది.
అంతకుముందు అహ్మదాబాద్, ఢిల్లీ విమానాలకు పరిమితంగా చెక్-ఇన్ అనుమతి లభించినప్పటికీ, వాటిలో రెండింటినే బయలుదేరేందుకు అనుమతించారు.
Details
అక్టోబర్ 13 తర్వాత చెల్లింపులు లేవు
హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం, నవంబర్ 12న దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ స్పైస్‌జెట్‌కు ఈ విషయంపై ఈ-మెయిల్ పంపింది.
అక్టోబర్ 13 నుంచి ఎలాంటి చెల్లింపులు అందలేదని అందులో పేర్కొంది. చెల్లింపు నిబంధనలు పాటించకపోవడంతో మరింత ఆర్థిక నష్టాన్ని నివారించేందుకు చెక్-ఇన్ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
Details
ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిలో స్పైస్‌జెట్
స్పైస్‌జెట్ కొంతకాలంగా ఆర్థిక, నిర్వహణ సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం విమానాల సంఖ్య సుమారు 12కి తగ్గగా, వాటిలో 9 మాత్రమే కార్యకలాపాల్లో ఉన్నాయి.
దేశీయ మార్కెట్ వాటా జనవరిలో 3.9 శాతం నుంచి సెప్టెంబర్‌లో కేవలం 0.6 శాతానికి పడిపోయింది.
సెప్టెంబర్‌లోనే 20.29 శాతం షెడ్యూల్డ్ విమానాలను రద్దు చేయగా, ప్రధాన విమానాశ్రయాల్లో సమయానికి నడిచిన విమానాల రేటు 16.6 శాతంగా నమోదైంది.
Details
సమస్యను పరిష్కరిస్తామన్న సంస్థ
సరఫరాదారులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలోనూ స్పైస్‌జెట్‌పై ఒత్తిడి ఉంది.
ఏప్రిల్-సెప్టెంబర్ 2026 మధ్య 45 రోజుల గడువు దాటిన తర్వాత కూడా చిన్న వ్యాపారాలకు రూ.63.03 కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం.
సమస్యను త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో కలిసి పనిచేస్తున్నామని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు.
బ్యాంక్ గ్యారంటీ కవరేజీ అందుబాటులో ఉందని, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.