Page Loader
Zoho CEO: ప్రముఖ ఐటీ సంస్థ జోహో కార్పొరేషన్‌ సీఈవోగా వైదొలిగిన శ్రీధర్‌ వెంబు.. .. కొత్త బాధ్యతల్లోకి 
ప్రముఖ ఐటీ సంస్థ జోహో కార్పొరేషన్‌ సీఈవోగా వైదొలిగిన శ్రీధర్‌ వెంబు.. .. కొత్త బాధ్యతల్లోకి

Zoho CEO: ప్రముఖ ఐటీ సంస్థ జోహో కార్పొరేషన్‌ సీఈవోగా వైదొలిగిన శ్రీధర్‌ వెంబు.. .. కొత్త బాధ్యతల్లోకి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 27, 2025
05:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్లౌడ్‌ ఆధారిత బిజినెస్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ జోహో కార్పొరేషన్‌ (Zoho Corp) సీఈవో పదవి నుంచి శ్రీధర్‌ వెంబు వైదొలిగారు. కంపెనీ సహ వ్యవస్థాపకులలో ఒకరైన ఆయన, కొత్త బాధ్యతలు చేపట్టనున్నట్లు 'ఎక్స్‌' వేదిక ద్వారా వెల్లడించారు. తన కంపెనీ చీఫ్‌ సైంటిస్ట్‌గా వ్యవహరిస్తూ, పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో జరుగుతున్న పరిణామాలు, తాము ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. తన వ్యక్తిగత గ్రామీణాభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగించడంతో పాటు ఆర్‌అండ్‌డీ కార్యక్రమాలకు పూర్తిసమయాన్ని కేటాయించనున్నట్లు తెలిపారు.

వివరాలు 

చీఫ్‌ సైంటిస్ట్‌గా కొత్త పాత్ర

''సీఈవో పదవి నుంచి వైదొలగుతున్నప్పటికీ, సంస్థ పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలకు బాధ్యత వహిస్తూ చీఫ్‌ సైంటిస్ట్‌గా కొత్త పాత్రను స్వీకరిస్తున్నాను. మా కంపెనీ సహ వ్యవస్థాపకుడు శైలేష్‌ కుమార్‌ దావే కొత్త గ్రూప్‌ సీఈవోగా వ్యవహరిస్తారు. మరో సహ వ్యవస్థాపకుడు టోనీ థామస్‌ జోహో యూఎస్‌ను నడిపిస్తారు. రాజేశ్‌ గణేశన్‌ మేనేజ్‌ఇంజిన్‌ డివిజన్‌ను, మణి వెంబు జోహో.కామ్‌ డివిజన్‌ను లీడ్‌ చేస్తారు'' అని ఆయన వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శ్రీధర్‌ వెంబు చేసిన ట్వీట్