LOADING...
EPF: ఈపీఎఫ్‌ గరిష్ఠ వేతన పరిమితి పెంపు దిశగా అడుగులు?
ఈపీఎఫ్‌ గరిష్ఠ వేతన పరిమితి పెంపు దిశగా అడుగులు?

EPF: ఈపీఎఫ్‌ గరిష్ఠ వేతన పరిమితి పెంపు దిశగా అడుగులు?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 01, 2026
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం వేతన జీవుల ఈపీఎఫ్‌ (EPF) గరిష్ఠ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ మేరకు ఈఎస్‌ఐ (ESI) ఈపీఎఫ్‌ పథకాల్లో ఒకే వేతన పరిమితి అమలు చేయాలనేది కేంద్రం భావిస్తోంది. సుదీర్ఘకాలంగా కనీస వేతన పరిమితి పెంపుపై కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో త్వరలో నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం ఉంది. బడ్జెట్‌లో ప్రత్యక్షంగా ప్రస్తావించకపోతే సెంట్రల్ బోర్డు ట్రస్టీ (CBT) సమావేశంలో కేంద్రం ఈ అంశంపై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కనీస పింఛను పెంపుపై ప్రతిపాదనలు కూడా సీబీటీలో చర్చకు వచ్చాయి. ప్రస్తుతం ఈపీఎఫ్‌ చందాదారులకు కనీస పింఛను రూ.1,000 నుంచి రూ.2-3,000 వరకు ఉంది

Details

ఇతర వివరాలు

ఈపీఎఫ్‌ గరిష్ఠ వేతన పరిమితి 2014లో రూ.6,500గా ఉంది. ఆ ఏడాది కేంద్ర కార్మికశాఖ దాన్ని రూ.15,000కు పెంచింది. తర్వాత ఐదేళ్లుగా కార్మిక సంఘాలు వేతన పరిమితి పెంపుపై డిమాండ్‌ చేస్తున్నారు. కొత్త లేబర్ కోడ్‌ ప్రకారం ఈపీఎఫ్‌ మరియు ఈఎస్‌ఐ వేతన పరిమితి ఒకే విధంగా ఉండాలి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కనీస వేతన పరిమితి రూ.22,000 నుంచి రూ.25,000 వరకు ఉంది. సీబీటీ సమావేశాల్లో కార్మిక సంఘాలు ఈ అంశాన్ని ప్రతినిధులుగా చర్చిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేతన పరిమితి రూ.25,000కు పెరగనుందని అంచనా వేస్తున్నారు.

Details

నగదు నిల్వ, పింఛను పెరుగుదల

వేతన పరిమితి (బేసిక్‌ + డీఏ కలిపి)ను నెలకు రూ.25,000కు పెంచితే, ఈ పధకం కింద ఉద్యోగుల ఖాతాలలో జమ అయ్యే సొమ్ము పెరుగుతుంది. రూ.25,000 వేతనంలో ఉద్యోగి 12% అంటే రూ.3,000 EPF ఖాతాకు జమ అవుతుంది. యాజమాన్యం కూడా 12% జమ చేస్తుంది. ఇందులోs8.33%(రూ.2,083)EPSకు వెళ్తుంది, మిగిలిన సొమ్ము ఉద్యోగి ఖాతాకు చేరుతుంది. ప్రస్తుతంలో కొందరు ఉద్యోగుల వాస్తవ వేతనం ఎక్కువగా ఉన్నా, పింఛను లెక్కింపులో వేతన పరిమితి రూ.15,000కే పరిమితం. పెంపు అనంతరం రూ.25,000ను పరిగణనలోకి తీసుకుంటే, విశ్రాంత కార్మికుల చేతికొచ్చే పింఛను గణనీయంగా పెరుగుతుంది. మొత్తానికి, ఈపీఎఫ్‌ గరిష్ఠ వేతన పరిమితి పెంపుతో ఉద్యోగుల నిల్వ ఖాతాలు, భవిష్యత్తు పింఛన్లపై సానుకూల ప్రభావం కనిపించే అవకాశం ఉంది.

Advertisement