Loading...
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన సూచీలు.. 898 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
భారీ లాభాల్లో ముగిసిన సూచీలు.. 898 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

Stock Market: భారీ లాభాల్లో ముగిసిన సూచీలు.. 898 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలను చవిచూసిన సూచీలు.. ఆ తర్వాత క్రమంగా కోలుకుని లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు, ఆసియా మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగినప్పటికీ.. దేశీయంగా ఐటీ, బ్యాంకింగ్ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో ప్రధాన సూచీలు గణనీయమైన లాభాలను నమోదు చేశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 897.96 పాయింట్లు (1.08 శాతం) పెరిగి 83,919.71 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 286.30 పాయింట్లు (1.12 శాతం) లాభపడి 25,800.60 వద్ద ముగిసింది.

వివరాలు 

బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్ల జోరు

బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్ల జోరు కనిపించడంతో నిఫ్టీ బ్యాంక్ సూచీ ఏకంగా 1,572.20 పాయింట్లు (2.49 శాతం) ఎగబాకి 64,635.20 వద్ద స్థిరపడింది.

మిడ్ క్యాప్ సూచీ 0.40 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 0.07 శాతం చొప్పున స్వల్ప లాభాలను నమోదు చేశాయి.

రంగాలవారీగా పరిశీలిస్తే ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్, హెల్త్‌కేర్, సిమెంట్ రంగాల షేర్లు లాభాలతో ముగిశాయి.

మరోవైపు మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌యూ బ్యాంకులు), మీడియా, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

వ్యక్తిగత షేర్ల విషయానికి వస్తే జూపిటర్ లైఫ్ లైన్ 11.20 శాతం లాభంతో అగ్రస్థానంలో నిలిచింది.

వివరాలు 

బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్ల జోరు

ఇండస్ఇండ్ బ్యాంక్ 8.88 శాతం, ఈఐహెచ్ 7.48 శాతం, సిటీ యూనియన్ బ్యాంక్ 7.07 శాతం, ఆస్టర్ డీఎం క్వాలిటీ 5.38 శాతం చొప్పున పెరిగాయి.

మరోవైపు ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ 6.78 శాతం, శిల్పా మెడికేర్ 6.76 శాతం, స్కై గోల్డ్ అండ్ డైమండ్ 6.70 శాతం, లాయిడ్స్ ఎంటర్‌ప్రైజెస్ 4.74 శాతం, అపోలో మైక్రో సిస్టమ్స్ 4.72 శాతం చొప్పున నష్టపోయాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం ప్రతికూల పరిస్థితులు కొనసాగాయి.

ఆసియా పసిఫిక్ సూచీ 3.3 శాతం, ఎమర్జింగ్ మార్కెట్ల సూచీ 3 శాతం మేర పడిపోయాయి. యూరోపియన్ స్టాక్స్ 600 సూచీ కూడా 0.9 శాతం నష్టాల్లో ట్రేడయ్యింది.

ADVERTISEMENT

వివరాలు 

రూపాయి మారకం విలువ 0.6 శాతం బలపడింది 

అమెరికా మార్కెట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంపెనీల షేర్లపై నెలకొన్న ఆందోళనలు ప్రభావం చూపించాయి.

ఈ నేపథ్యంలో ఆంత్రోపిక్ షేర్లు వరుసగా రెండో రోజు ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో 7 శాతం క్షీణించాయి. మరోవైపు కరెన్సీ మార్కెట్లో భారత రూపాయికి బలం చేకూరింది.

అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 0.6 శాతం బలపడి 92.67 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనతలు కొనసాగినప్పటికీ దేశీయంగా బ్యాంకింగ్, ఐటీ షేర్ల కొనుగోళ్లు మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి.

ADVERTISEMENT