LOADING...
Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2026
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ఈక్విటీ మార్కెట్లు నేటి సెషన్‌లో దాదాపు స్థిరంగా ముగిశాయి. భారత్‌-అమెరికా మధ్య ట్రేడ్‌ ఒప్పందంపై ఉన్న ఆశావహ వాతావరణంతో గత మూడు సెషన్లుగా లాభాల్లో దూసుకెళ్లిన సూచీలు,ఈ రోజు మాత్రం పరిమిత శ్రేణిలోనే ఊగిసలాడాయి. ముఖ్యంగా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో మార్కెట్‌పై ప్రభావం పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఉదయం 84,339.15 పాయింట్ల వద్ద (ముందురోజు ముగింపు 84,273.92) లాభాలతో ప్రారంభమైంది. ట్రేడింగ్‌ సమయంలో ఇది 84,081.25 నుంచి 84,487.34 పాయింట్ల మధ్య కదిలింది. చివరకు 40.28 పాయింట్ల స్వల్ప నష్టంతో 84,233.64 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 18.70 పాయింట్లు పెరిగి 25,953.85 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.70గా కొనసాగింది.

వివరాలు 

బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 69.71 డాలర్లు 

సెన్సెక్స్‌ 30 షేర్లలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎటెర్నెల్‌ వంటి ఐటీ షేర్లు ప్రధానంగా నష్టాలను చవిచూశాయి. ఇక ఎస్‌బీఐ, మారుతీ సుజుకీ, ఇండిగో, ట్రెంట్‌, రిలయన్స్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 69.71 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 5070 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది.

Advertisement