Loading...
Stock Market: బ్యాంకింగ్‌,రియాల్టీ షేర్ల జోరు.. రెండోరోజూ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
బ్యాంకింగ్‌,రియాల్టీ షేర్ల జోరు.. రెండోరోజూ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Stock Market: బ్యాంకింగ్‌,రియాల్టీ షేర్ల జోరు.. రెండోరోజూ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2026
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందినప్పటికీ.. ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSU Banks),రియాల్టీ రంగ షేర్లలో మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సూచీలు పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) కొనుగోళ్లు చేపట్టడం కూడా మార్కెట్‌కు కలిసొచ్చాయి. బుధవారం ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ క్రితం ముగింపు 82,104.79 పాయింట్లతో పోలిస్తే స్వల్ప లాభంతో 82,150.62 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కువ సమయం లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో ఒక దశలో 82,897.49 పాయింట్ల గరిష్ఠ స్థాయిని అందుకుంది.

వివరాలు 

అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.93.47గా నమోదు 

చివరకు 427.40 పాయింట్లు పెరిగి 82,532.19 వద్ద స్థిరపడింది. మరోవైపు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 96.30 పాయింట్ల లాభంతో 25,387.40 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌-30లో యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), టీసీఎస్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభాలను నమోదు చేశాయి.

మరోవైపు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఐటీసీ షేర్లు నష్టాలతో ముగిశాయి.

కరెన్సీ మార్కెట్లో అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.93.47గా నమోదైంది.

అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 92.43 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు బంగారం ఔన్సు ధర 3,856 డాలర్లుగా ఉంది.

ADVERTISEMENT