LOADING...
Stock Market: నష్టాలలో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @25,800, 345 పాయింట్లు క్షిణించిన సెన్సెక్స్ 
345 పాయింట్లు క్షిణించిన సెన్సెక్స్

Stock Market: నష్టాలలో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @25,800, 345 పాయింట్లు క్షిణించిన సెన్సెక్స్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2025
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం చూపింది. దీనివల్ల ఆరు రోజులుగా కొనసాగుతున్న లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్‌ 340 పాయింట్లతో నష్టపోయి ముగిసినప్పటికీ, నిఫ్టీ 96 పాయింట్ల మేర క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 65.92 డాలర్ల వద్ద కొనసాగుతుంది, కాగా బంగారం 4066 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఉదయం 84,667.23 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ తరువాత నష్టాల్లోకి పడింది.

వివరాలు 

డాలర్ మారకం విలువ 87.83గా నమోదు 

చివరికి 344.52 పాయింట్ల నష్టంతో 84,211.88 వద్ద ముగిసింది. నిఫ్టీ 96.25 పాయింట్ల నష్టంతో 25,795.15కి చేరింది. రూపాయి-డాలర్ మారకం విలువ 87.83గా ఉంది. సెన్సెక్స్‌ 30లో ప్రధానంగా హిందుస్థాన్‌ యునిలీవర్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, అదానీ పోర్ట్స్‌, టైటాన్‌, కొటక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. మరోవైపు, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బీఎల్‌, సన్‌ ఫార్మా, ఐటీసీ షేర్లు లాభాన్ని సాధించాయి.