తదుపరి వార్తా కథనం

Stock market: నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్
వ్రాసిన వారు
Sirish Praharaju
Oct 14, 2025
04:09 pm
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజు నష్టాల్లోనే ముగిశాయి.వివిధ రంగాల సూచీలు దాదాపు అన్ని నష్టంలో ట్రేడయ్యాయి. ఫార్మా,మెటల్,మీడియా,పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఒక్కొక్కటి సుమారు 1 శాతం తగ్గడం గమనార్హం. సెన్సెక్స్ 360 పాయింట్లతో క్షీణించగా, నిఫ్టీ 104 పాయింట్లు తగ్గింది. ఉదయం 82,404.54 వద్ద ప్రారంభమైన సూచీ (ముందు ముగింపు 82,327.05) రోజంతా నష్టాల్లో ఊగిసలాడింది. చివరికి 368.07 పాయింట్లు క్షీణించి 81,958.98 వద్ద స్థిరపడింది.నిఫ్టీ కూడా 104 పాయింట్లతో 25,122.75 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీలో ప్రధానంగా టాటా మోటర్స్,డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్,బజాజ్ ఫైనాన్స్,భారత్ ఎలక్ట్రానిక్స్, టీసీఎస్ షేర్లు నష్టపడ్డాయి. కానీ విప్రో, మ్యాక్స్ హెల్త్‌కేర్, టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభంతో ముగిశాయి.