LOADING...
Stock Market: అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం.. వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు పతనం
అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం.. వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు పతనం

Stock Market: అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం.. వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు పతనం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2026
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ షేర్‌ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ తీవ్రంగా పడిపోయాయి. ఇరాన్‌-అమెరికా మధ్య చర్చలపై అనిశ్చితి నెలకొనడం, హర్మూజ్ ప్రాంతంలో దిగ్బంధం కొనసాగుతుండటం పెట్టుబడిదారుల మనోభావాలను దెబ్బతీసింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్‌కు వంద డాలర్లకు మించి పెరగడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఈ పరిస్థితుల్లో సెన్సెక్స్‌ ఎనిమిది వందల యాభై పాయింట్లకు పైగా కోల్పోయి,నిఫ్టీ ఇరవై నాలుగు వేల రెండు వందల దిగువన ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 77973 వద్ద నష్టాల్లోనే ప్రారంభమైంది. రోజంతా అదే ధోరణి కొనసాగి, మధ్యాహ్న సమయంలో 77574 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 852 పాయింట్ల నష్టంతో 77664 డెబ్బై వద్ద స్థిరపడింది. నిఫ్టీ 2500పాయింట్ల నష్టంతో 24173 వద్ద ముగిసింది.

వివరాలు 

బంగారం ధర 4688 డాలర్లు 

ఇదే సమయంలో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ మరింత పడిపోయి 94 దాటింది. ముఖ్యంగా ట్రెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్‌, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. మరోవైపు అదానీ పోర్ట్స్‌, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, బీఈఎల్‌ షేర్లు మాత్రమే లాభాల్లో నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధర బ్యారెల్‌కు 103 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ధర 4688 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement