LOADING...
Stock market: లాభాల్లో మగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 
లాభాల్లో మగిసిన దేశీయ మార్కెట్ సూచీలు..

Stock market: లాభాల్లో మగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం బలమైన లాభాలతో సెషన్‌ను ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్‌ క్లూస్‌, ముఖ్యంగా ఫైనాన్షియల్స్‌, ఆయిల్‌ & గ్యాస్‌ రంగాల్లో కొనుగోళ్లు వేగం పుంజుకోవడంతో కీలక సూచీలు మెరుగైన ప్రదర్శన చూపాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్టాక్‌లు సూచీలకు మంచి బలం అందించాయి. దీంతో సూచీలు గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఏర్పడిన ఆల్‌టైమ్‌ హైలకు దాదాపు చేరువయ్యాయి. సెన్సెక్స్‌ ఉదయం 85,470.92 వద్ద (ప్రీవియస్‌ క్లోజ్‌ 85,186.47) సానుకూలంగా ప్రారంభమై రోజంతా గ్రీన్‌లోనే కొనసాగింది. ట్రేడింగ్‌ సమయంలో 85,801.70 వరకు ఎగబాకిన ఈ సూచీ, చివరకు 446.21 పాయింట్లు పెరిగి 85,632.68 వద్ద రోజు ముగింపు చూసింది.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 64.14 డాలర్లు 

నిఫ్టీ కూడా 139.50 పాయింట్లు లాభపడి 26,192.15 వద్ద క్లోజ్‌ అయింది. అంతేకాక, రూపాయి-డాలర్‌ మారకం విలువ 88.71గా నమోదైంది. గత ఏడాది సెప్టెంబర్‌ 27న సెన్సెక్స్‌ 85,978 వద్ద తన ఆఖరి గరిష్ఠాన్ని తాకగా, నిఫ్టీ 26,277 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్‌ హైను నమోదు చేసిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్‌-30లో బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా షేర్లు బలంగా నిలిచాయి. మరోవైపు ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టైటాన్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 64.14 డాలర్ల చుట్టూ ఉండగా, బంగారం ఔన్సు 4063 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.