Stock Market: సీజ్‌ఫైర్ ప్రభావం.. బుల్ రన్‌లో మార్కెట్లు..సెన్సెక్స్ 2700 పాయింట్లు ప్లస్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌లో గణనీయమైన లాభాలతో దూసుకుపోతున్నాయి. ఇరాన్,అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి తగ్గింది. దీనితో పాటు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా తగ్గిపోవడం మార్కెట్లకు ఊతమిచ్చింది. ఈ సానుకూల పరిణామాల ప్రభావంతో ప్రధాన సూచీలు బలంగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 2,700 పాయింట్లకు పైగా ఎగబాకి మార్కెట్లో ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తోంది.
వివరాలు
రూపాయి @92.56
మరోవైపు నిఫ్టీ కూడా మళ్లీ 23,500 స్థాయిని దాటి బలంగా ట్రేడ్ అవుతోంది. ఉదయం 9:25 గంటల సమయానికి సెన్సెక్స్ 2,655.9 పాయింట్ల లాభంతో 77,272.48 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 775.4 పాయింట్లు పెరిగి 23,899.05 స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఇక రూపాయి విలువ కూడా కొంతవరకు కోలుకుంది. నేటి ట్రేడింగ్‌లో రూపాయి 50 పైసలు బలపడి డాలర్‌కు 92.56 వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉంటే, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ 100 డాలర్ల కంటే దిగువకు పడిపోవడం పెట్టుబడిదారులకు మరింత ధైర్యాన్ని కలిగిస్తోంది.