LOADING...
Stock market: భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 25వేలు దాటిన నిఫ్టీ 
భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 25వేలు దాటిన నిఫ్టీ

Stock market: భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 25వేలు దాటిన నిఫ్టీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2025
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం రోజు శక్తివంతమైన లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో ప్రధాన సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 527 పాయింట్ల వృద్ధితో 84,480.09 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 156 పాయింట్లు ఎగసి 25,870.10 వద్ద ట్రేడవుతోంది. అంతేకాక, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.91గా ఉంది.

వివరాలు 

ఏ షేర్లు ఎలా ? 

నిఫ్టీ సూచీలో రిలయన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. మరోవైపు, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, ట్రెంట్, టాటా స్టీల్ షేర్లు నష్టంలో కొనసాగుతున్నాయి.