LOADING...
Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్

Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2025
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి.అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న ప్రతికూల సంకేతాలు మన మార్కెట్ పై ప్రభావం చూపి సూచీలు నష్టాలకు గురయ్యాయి. ముఖ్యంగా, చైనా ఉత్పత్తులపై 100శాతం అదనపు సుంకాలు విధించే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం మదుపర్లలో అప్రమత్తతను సృష్టించింది. ఈ కారణంగా సెన్సెక్స్ 173 పాయింట్ల మేర తగ్గి, నిఫ్టీ 58 పాయింట్ల క్షీణతను ఎదుర్కొంది. ఉదయం సూచీలు 82,049.16 వద్ద నష్టాలతో ప్రారంభమయ్యాయి. తర్వాత ఒక దశలో 82,438.50 పాయింట్ల గరిష్ఠానికి చేరాయి. చివరికి సెన్సెక్స్ 173.77 పాయింట్లు కోల్పోయి 82,327.05 వద్ద స్థిరపడింది.

వివరాలు 

విదేశీ మారక విలువల్లో రూపాయి డాలర్‌తో పోలిస్తే 88.66 వద్ద స్థిరంగా ఉంది

నిఫ్టీ కూడా 58 పాయింట్లు తగ్గి 25,227.35 వద్ద ముగిసింది. విదేశీ మారక విలువల్లో రూపాయి డాలర్‌తో పోలిస్తే 88.66 వద్ద స్థిరంగా ఉంది. నిఫ్టీ సూచీ లో టాటా మోటర్స్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, విప్రో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌ షేర్లు నష్టాలలో ట్రేడయ్యాయి. మరోవైపు, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌ షేర్లు లాభాలను సాధించాయి.