Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు..
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.40 గంటల సమయంలో సెన్సెక్స్ 563 పాయింట్లు పడిపోయి 78,709 వద్ద కొనసాగగా, నిఫ్టీ 137 పాయింట్లు తగ్గి 24,439 వద్ద ట్రేడింగ్ సాగించింది. ఇదే సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 31 పైసలు బలహీనపడి రూ. 93.75 వద్ద నమోదైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను ఏకపక్షంగా పొడిగించినప్పటికీ, హర్మూజ్ సముద్ర మార్గంలో కొనసాగుతున్న దిగ్బంధనం కారణంగా చమురు సరఫరా సమస్యలు త్వరలో పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు.
వివరాలు
నష్టాల్లోనే ట్రేడింగ్‌ను ముగించిన అమెరికా మార్కెట్లు
ఈ పరిణామాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అదేవిధంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్ పర్యటన వాయిదా పడటం కూడా అంతర్జాతీయంగా ఆందోళనలకు దారితీసింది. ఇక ప్రపంచ మార్కెట్ల పరిస్థితి కూడా అనుకూలంగా లేదు. హాంకాంగ్ సూచీ 1.11 శాతం, దక్షిణ కొరియా కోస్పీ సూచీ 0.54 శాతం, జపాన్ నిక్కీ సూచీ 0.83 శాతం చొప్పున పడిపోయాయి. మరోవైపు అమెరికా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడింగ్‌ను ముగించడం గమనార్హం.