తదుపరి వార్తా కథనం

Stock market: లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Oct 10, 2025
10:32 am
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 282.04 పాయింట్లు పెరిగి 0.34 శాతం లాభంతో 82,454.14 స్థాయికి చేరగా, నిఫ్టీ 86.45 పాయింట్ల లాభంతో 0.34 శాతం పెరుగుతూ 25,268.25 వద్ద కొనసాగింది. మార్కెట్‌లో రీలయన్స్ పవర్ లిమిటెడ్, నాగరీకా క్యాపిటల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సంగం (ఇండియా), 5పైసా క్యాపిటల్, జిందాల్ ఫోటో లిమిటెడ్ వంటి కంపెనీలు అత్యధిక లాభాలను సాధించిన టాప్ గెయినర్స్ జాబితాలో చోటు చేసుకున్నాయి. మరోవైపు, లక్ష్మీ గోల్డోర్నా హౌస్, క్యాపిటల్ ట్రస్ట్, తమిళనాడు టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్, మెక్లియోడ్ రస్సెల్ (ఇండియా), సోలెక్స్ ఎనర్జీ వంటి సంస్థలు నష్టపోయిన కంపెనీలుగా మార్కెట్‌లో చోటు చేసుకున్నాయి.