Stock Market: మార్కెట్‌లో మళ్లీ ఒడుదుడుకులు.. ఒక్కరోజు లాభాలు ఆవిరి.. భారీ నష్టాల్లో సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ అస్థిరతలోకి జారుకుంది. నిన్న ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ వార్తలతో మార్కెట్ భారీగా పుంజుకుంది. అయితే ఆ ఉత్సాహం ఎక్కువసేపు నిలవలేదు. గంటల వ్యవధిలోనే పరిస్థితులు మారిపోయాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ తీవ్ర దాడులు జరపడం, హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల అంతర్జాతీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఇదే సమయంలో శాంతి చర్చలు కూడా ముందుకు సాగకపోవడం పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచింది. గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు కనిపించడంతో గురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే దేశీయ మార్కెట్ ఒత్తిడిలో పడింది. నిన్నటి లాభాలు నిలవకపోవడంతో పెట్టుబడిదారుల ఆశలు చల్లారాయి.
వివరాలు
నిఫ్టీ @ 23,944
ప్రస్తుతం సెన్సెక్స్ 249 పాయింట్లు పడిపోయి 77,313 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 53 పాయింట్లు తగ్గి 23,944 స్థాయిలో కొనసాగుతోంది. నిఫ్టీలో ఎన్‌టీపీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, మాక్స్ హెల్త్‌కేర్, బజాజ్ ఆటో, హిండాల్కో షేర్లు లాభాల్లో ఉండగా... బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, ఎం అండ్ ఎం షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.