Stock market today: బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్లు; 24,000 దగ్గర నిఫ్టీ50
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. గత సెషన్‌లో భారీ నష్టాలు ఎదుర్కొన్న ఈ సూచీలు ఈ రోజు కోలుకోవడంతో ట్రేడింగ్ ప్రారంభమయ్యాయి. కనిష్ట స్థాయిల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సూచీలు పాజిటివ్ ట్రెండ్‌లో కొనసాగుతున్నాయి. ఉదయం 9:28 గంటల సమయంలో, సెన్సెక్స్ 286.43 పాయింట్లు పెరిగి 79,329 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. అదే విధంగా, నిఫ్టీ 97.45 పాయింట్లు పెరిగి 24,013 వద్ద కొనసాగుతోంది. రూపాయి మారకం విలువ 84.49 డాలర్లతో ఉంది.
లాభాల్లో ట్రేడవుతున్న అదానీ పోర్ట్స్ షేర్లు
నిఫ్టీ 30 సూచీలో సన్ ఫార్మా, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అలాగే, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టీసీఎస్, టెక్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.