NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: ఫ్లాట్‌ ఓపెనింగ్‌ తర్వాత ఒడిదొడుకులకు గురైన స్టాక్ మార్కెట్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market: ఫ్లాట్‌ ఓపెనింగ్‌ తర్వాత ఒడిదొడుకులకు గురైన స్టాక్ మార్కెట్
    ఫ్లాట్‌ ఓపెనింగ్‌ తర్వాత ఒడిదొడుకులకు గురైన స్టాక్ మార్కెట్

    Stock Market: ఫ్లాట్‌ ఓపెనింగ్‌ తర్వాత ఒడిదొడుకులకు గురైన స్టాక్ మార్కెట్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 28, 2025
    10:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాల కారణంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

    దీంతో సూచీలు ఒడిదొడుకులకు లోనయ్యాయి. మొదట ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ, కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి.

    ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 127 పాయింట్ల నష్టంతో 77,444 వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 23,551 వద్ద ట్రేడవుతోంది.

    Details

     లాభాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు

    సెన్సెక్స్ 30 సూచీలో కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, టాటా స్టీల్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

    ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మారుతీ సుజుకీ, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 74.05 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 3,083 డాలర్ల మార్క్ దాటి ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.66 వద్ద ప్రారంభమైంది.

    Details

    నష్టాల్లో అమెరికా మార్కెట్లు

    అమెరికా మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. ఎస్‌అండ్‌పీ సూచీ 0.33%, నాస్‌డాక్ 0.53%, డౌజోన్స్ 0.37% నష్టాల్లో ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి.

    ఆస్ట్రేలియన్ ఏఎస్‌ఎక్స్ 0.07% లాభంతో, జపాన్ నిక్కీ 2.09%, హాంకాంగ్ హాంగెసెంగ్ 0.81%, షాంఘై 0.70% నష్టాల్లో ఉన్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం భారీగా కొనుగోళ్లు జరిపారు.

    ఒక్క రోజులోనే రూ.11,111 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.2,518 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్
    వ్యాపారం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    స్టాక్ మార్కెట్

    Stock Market: వరుసగా 10వ రోజు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్  బిజినెస్
    Stock Market: స్టాక్‌ మార్కెట్లు లాభాల్లోకి.. నిఫ్టీ 22,200 మార్క్‌ దాటింది! వ్యాపారం
    Stock market: ఆసియా మార్కెట్ల ప్రభావం.. భారీ లాాభాల్లో ముగిసిన సూచీలు వ్యాపారం
    Stock Market : లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు బిజినెస్

    వ్యాపారం

    Tim Cook: యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వేతనం భారీగా పెంపు.. ఎంతంటే ఆపిల్
    Stock Market: స్టాక్ మార్కెట్లలో భారీ నష్టం.. 800 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ స్టాక్ మార్కెట్
    Salary increase: 2025లో దేశీయ వేతనాలు 9.4శాతం పెరిగే అవకాశం బిజినెస్
    Zomato Q3 results: జొమాటో ఆదాయం 64% పెరిగింది.. లాభాల్లో మాత్రం క్షీణిత జొమాటో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025