Stock Market: లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,311
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. భారత్,ఐరోపా యూనియన్ (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ఒప్పందం కుదిరిన వార్తలు మార్కెట్‌లో సానుకూల ప్రభావాన్ని చూపాయి. రూపాయి కొంత స్థిరపడటం కూడా మార్కెట్ సెంటిమెంట్‌కు తోడ్పడింది. ఉదయం 9.41 గంటల వరకు సెన్సెక్స్ 431 పాయింట్ల లాభంతో 82,217 స్థాయిలో కదిలింది. నిఫ్టీ సూచీ 136 పాయింట్ల పెరుగుదలతో 25,311 వద్ద ట్రేడింగ్ అయ్యింది. ఒక దశలో సెన్సెక్స్ 700 పాయింట్ల పెరుగుదలను కూడా సాధించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.57 వద్ద ఉంది.
వివరాలు
నిఫ్టీ సూచీ
నిఫ్టీ సూచీలో ఓఎన్‌జీసీ, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో, రిలయన్స్, కోల్ ఇండియా వంటి స్టాక్స్ లాభాలను రాబడుతున్నాయి. అయితే ఏషియన్ పెయింట్స్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, మ్యాక్స్ హెల్త్‌కేర్ స్టాక్స్ నష్టాలతో కొనసాగుతున్నాయి.