తదుపరి వార్తా కథనం
Stock Market: స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు..
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 03, 2025
09:51 am
ఈ వార్తాకథనం ఏంటి
గతవారం భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రారంభంలో కొంత స్థిరత్వం సాధించాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన అనుకూల సంకేతాలు, కనిష్ఠ స్థాయిల వద్ద జరిగిన కొనుగోళ్ల కారణంగా సోమవారం ట్రేడింగ్ లాభాలతో ప్రారంభమైంది.
ఉదయం 9:30 గంటల సమయంలో, సెన్సెక్స్ 156 పాయింట్ల లాభంతో 73,354 వద్ద ఉండగా, నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 22,179 స్థాయికి చేరుకుంది.
ప్రీ-ట్రేడింగ్‌లో, సెన్సెక్స్ 320 పాయింట్ల వరకు ఎగసింది. నిఫ్టీ సూచీలో శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అపోలో హాస్పిటల్స్ షేర్లు లాభాలను చూపిస్తున్నాయి.
యాక్సిస్ బ్యాంక్, జియో ఫైనాన్షియల్, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్, సిప్లా షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.