Stock Market : భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ లో నష్టాలకు బ్రేక్ పడింది. సూచీల వారాంతంలో భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 480 పాయింట్లు, నిప్టీ 135 పాయింట్లు పెరగడం విశేషం. వరుసగా మూడు రోజుల పాటు నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల బాటలో ముగిశాయి. ఉదయం సెషన్ లోనే లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. మార్కెట్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్సైంజీ సూచి బీఎస్ఈ సెన్సెక్స్ 480 లాభపడి 65,721 పాయింట్లకు పెరిగింది. మరోవైపు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచి ఎన్ఎస్ఈ నిఫ్టీ 135 పాయింట్లు వృద్ధి చెంది 19,517 పాయింట్ల వద్ద నిలిచిపోయింది.
నష్టాలను చవిచూసిన ఎస్బీఐ
ఈరోజు ట్రేడింగ్‌లో సిప్లా, ఇండస్ ఇండ్ బ్యాంకు, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల బాట పట్టాయి. మరోవైపు ఎస్బీఐ, బజాజ్ ఆటో, బీపీసీఎల్, ఎన్టీపీసీ, మారుతీ సుజకీ షేర్లు నష్టాలను చవిచూశాయి బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.25%), టెక్ మహీంద్రా (2.91%), విప్రో (2.28%), భారతి ఎయిర్ టెల్ (2.02%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.72%). టాప్ లూజర్స్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.94%), ఎన్టీపీసీ (-1.09%), మారుతి (-0.83%), టాటా మోటార్స్ (-0.69%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.59%).