LOADING...
Stock Market: షేర్‌ మార్కెట్ల దూకుడు.. సెన్సెక్స్‌కు భారీ లాభం

Stock Market: షేర్‌ మార్కెట్ల దూకుడు.. సెన్సెక్స్‌కు భారీ లాభం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 10, 2026
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ షేర్‌ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ రంగం నుంచి వచ్చిన బలమైన మద్దతు, అంతర్జాతీయ మార్కెట్లలో కనిపించిన సానుకూల సంకేతాలు సూచీలకు ఊతమిచ్చాయి. దీంతో సెన్సెక్స్‌ 918 పాయింట్లు పెరిగి 77,550 వద్ద ముగిసింది. నిఫ్టీ 275 పాయింట్లు ఎగబాకి 24,050 వద్ద స్థిరపడింది. గత సెషన్‌లో 76,631 వద్ద ముగిసిన సెన్సెక్స్‌ ఈరోజు ట్రేడింగ్‌ను 77,121 వద్ద ప్రారంభించింది. మధ్యలో ఒక దశలో 77,622 స్థాయిని కూడా తాకింది.

వివరాలు 

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.73గా నమోదు 

నిఫ్టీ సూచీలో ఆసియన్ పెయింట్స్‌, ఐషర్ మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, శ్రీరామ్ ఫైనాన్స్‌, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో నిలిచాయి. మరోవైపు కోల్ ఇండియా, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలను చవిచూశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.73గా నమోదైంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోని షేర్లలో కనిపించిన భారీ కొనుగోళ్లు ఈరోజు మార్కెట్ల లాభాలకు ప్రధాన కారణమయ్యాయి. ఇదే సమయంలో దక్షిణ కొరియా, జపాన్ సహా ఆసియా దేశాల మార్కెట్లు కూడా లాభాల బాట పట్టాయి. రూపాయి ఒక దశలో బలపడటం కూడా మార్కెట్‌కు అనుకూలంగా మారింది.

Advertisement