Adani Group : అదానీ గ్రూప్‌కి భారీ ఊరట.. హిండెస్ బర్గ్ వివాదంలో సిట్ విచారణకు నో చెప్పిన సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టులో అదానీ గ్రూప్(Adani Group)నకు భారీ ఉపశమనం కలిగింది. హిండెన్ బర్గ్ వివాదంలో అదానీ గ్రూప్‌నకు క్లీన్ చీట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే హిండెన్ బర్గ్ నివేదకపై సెబీ దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అదానీ వ్యవహారంపై విచారణ జరపాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు(Supreme Court) బుధవారం తీర్పును వెల్లడించింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
అదానీ గ్రూప్ పై భారీ ఆరోపణలు
ఇక సెబీ దర్యాప్తును అనుమానించడానికి జార్జ్ సోరోస్ నేతృత్వంలోని ఓసీసీఆర్పీ నివేదిక ఆధారం కాదని పేర్కొంది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్టర్ హిండెన్ బర్గ్ గతేడాది అదానీ గ్రూప్ పై భారీ ఆరోపణలు చేసింది. ఈ నివేదికపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) విచారణ చేపట్టింది. అయితే, ఈ వ్యవహారంలో సెబీ దర్యాఫ్తు సరిపోదని, సిట్ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించి బుధవారం తీర్పు వెలువరించింది.