LOADING...
Swiggy: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో రిఫండ్‌ మోసం.. ఉచితంగా సరుకులు తెచ్చుకున్న యువకుడు! 
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో రిఫండ్‌ మోసం.. ఉచితంగా సరుకులు తెచ్చుకున్న యువకుడు!

Swiggy: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో రిఫండ్‌ మోసం.. ఉచితంగా సరుకులు తెచ్చుకున్న యువకుడు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2025
02:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆన్‌లైన్‌లో ఆహారం, కిరాణా సరుకులు ఆర్డర్‌ చేసే యాప్‌లను మోసం చేసే ఘటన బయటపడింది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ రిఫండ్‌ సిస్టమ్‌ను ఒక యువకుడు వరుసగా దుర్వినియోగం చేసిన విషయాన్ని ఓ రెడిట్‌ యూజర్‌ బహిర్గతం చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే—బెంగళూరుకు చెందిన ఓ యువకుడు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఖరీదైన సరుకులు ఆర్డర్‌ చేసేవాడు. సరుకులు సక్రమంగా అందుకున్న తర్వాత యాప్‌లోని 'హెల్ప్' సెక్షన్‌కి వెళ్లి, ఓ ఖరీదైన వస్తువు మిస్సింగ్‌గా చూపిస్తూ ఫిర్యాదు చేసేవాడు. అప్పుడు స్విగ్గీ సిస్టమ్‌ వెంటనే రిఫండ్‌ జారీ చేసేది.

Details

వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం

చాలా సార్లు కంపెనీ కస్టమర్‌పై నమ్మకం ఉంచి, ఎలాంటి సాక్ష్యం (అన్‌బాక్సింగ్‌ వీడియో వంటి) లేకుండానే డబ్బు తిరిగి చెల్లించేది. మొదట ఈ వ్యవహారం సరదాగా అనిపించింది. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇది పూర్తిగా నైతికతకు విరుద్ధం. ఇతనిని తప్పకుండా రిపోర్ట్‌ చేయాలని ఆ రెడిట్‌ యూజర్‌ తెలిపాడు. ప్రతి నెలా ఇలాంటి మోసాలు చేస్తూ, వాస్తవానికి తాను పొందిన సరుకులకే రిఫండ్‌ తీసుకుంటున్నాడని ఆయన వివరించాడు. ఈ పోస్ట్‌ వైరల్‌ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా మోసం.. ఇలాంటి పనుల వల్ల నిజంగా సమస్యలు ఎదుర్కొంటున్న వినియోగదారులకే ఇబ్బందులు వస్తాయని పలువురు కామెంట్లు చేశారు.

Details

రిఫండ్ పాలసీలు దెబ్బతినే ప్రమాదం

మరికొందరు స్విగ్గీ ఈ అనుమానాస్పద ఖాతాను త్వరలోనే బ్లాక్‌ చేస్తుందని హెచ్చరించారు. కొంతమంది యూజర్లు "అతని పని నువ్వు రిపోర్ట్‌ చేయవద్దు.. కానీ అతనికి త్వరలోనే స్విగ్గీ నుండి బ్లాక్‌ నోటీసు వస్తుందంటూ కామెంట్‌ చేయగా, మరికొందరు ఇలాంటి తప్పుడు ఫిర్యాదుల వల్ల రిఫండ్‌ పాలసీలు మరింత కఠినమవుతాయని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనతో ఆన్‌లైన్‌ రిటైల్‌ ప్లాట్‌ఫారమ్‌లలో నమ్మకంపై ఆధారపడి ఉన్న సేవలు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో మరోసారి బయటపడింది.

Advertisement