Swiggy Q2 results: స్విగ్గీ vs జొమాటో.. రెండో త్రైమాసిక ఫలితాల్లో ఎవరిది పైచేయి?
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. లిస్టింగ్ తర్వాత తొలిసారి ఫలితాలను వెల్లడించిన స్విగ్గీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 3,601 కోట్ల ఆదాయాన్ని చవిచూసింది. గతేడాది ఇదే కాలానికి ఆదాయం రూ. 2,763.3 కోట్లు ఉండగా, ఇప్పుడు 30 శాతం వృద్ధి సాధించడం విశేషం. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. కంపెనీ నష్టాలు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో స్విగ్గీ *రూ. 657 కోట్ల నష్టాలను ఎదుర్కొంది.
ఆదాయ పరంగా స్విగ్గీకి గట్టి పోటినిస్తున్న జొమాటో
ఈ ఏడాది రూ. 625.5 కోట్ల నష్టాలకు పరిమితమైంది. తొలి త్రైమాసికంలో కంపెనీ రూ. 3,222 కోట్ల ఆదాయాన్ని, రూ. 611 కోట్ల నష్టాలను నమోదు చేసింది. ఫుడ్ డెలివరీ రంగంలో స్విగ్గీ ప్రధాన పోటీదారు జొమాటో, రెండో త్రైమాసికంలో రూ. 4,799 కోట్ల ఆదాయాన్ని, రూ. 272 కోట్ల లాభాన్ని సాధించింది. దీంతో జొమాటో స్విగ్గీకి ఆదాయ పరంగా గట్టి పోటీనిస్తోంది. త్రైమాసిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో స్విగ్గీ షేర్లు ఈ ఉదయం 6 శాతం లాభంతో ప్రారంభమై, చివరికి 0.55 శాతం నష్టంతో రూ. 491 వద్ద ముగిసినట్లు తెలియజేసింది.