LOADING...
Investments: '11-12-20' ఫార్ములా: మిమ్మల్ని కోటీశ్వరులను చేసే మార్గం!
'11-12-20' ఫార్ములా: మిమ్మల్ని కోటీశ్వరులను చేసే మార్గం

Investments: '11-12-20' ఫార్ములా: మిమ్మల్ని కోటీశ్వరులను చేసే మార్గం!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2025
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం మార్కెట్లో పెట్టుబడులకు ఎన్నో మార్గాలు కనిపిస్తున్నాయి. తక్కువ రిస్క్‌తో మంచి రాబడులు రావాలని ఆశపడే వారికి సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) చాలా ఉపయోగపడే పద్ధతి. దీర్ఘకాలంలో ఆర్థికంగా బలపడే అవకాశాలు సిప్‌లో బాగా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా '11-12-20' అనే ప్రత్యేక ఫార్ములా పాటిస్తే, మన ఫైనాన్షియల్ గోల్స్‌ను సులభంగా చేరుకునే అవకాశం మరింత పెరుగుతుంది. ఈ ఫార్ములా అసలు ఏం సూచిస్తున్నదో ఒక్కసారి చూద్దాం.

వివరాలు 

ఫార్ములాలోని మూడు కీలక సూచనలు 

ఈ ఫార్ములాలో ఉన్న ప్రతి సంఖ్య ఒక్క కీలక అంశాన్ని సూచిస్తుంది. 1) మొదటి అంకె - 11 ఇది ప్రతీ నెలా పెట్టవలసిన పెట్టుబడి మొత్తాన్ని సూచిస్తుంది. అంటే నెలకు రూ.11,000ను క్రమం తప్పకుండా సిప్‌లో పెట్టాలి. కోటీశ్వర లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ మొత్తాన్ని నిలకడగా పెట్టడం చాలా ముఖ్యం. అలాగే ప్రతి సంవత్సరం ఈ మొత్తాన్ని 11 శాతం మేర పెంచుకుంటూ వెళితే ద్రవ్యోల్బణం ప్రభావం నుంచి బయటపడటం సులభమవుతుంది.

వివరాలు 

2) రెండో అంకె - 12 

ఇది రాబడి రేటును సూచిస్తుంది. అంటే ఏటా కనీసం 12 శాతం రిటర్న్ ఇచ్చే ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు సాధారణంగా దీర్ఘకాలంలో దీనికంటే ఎక్కువ రాబడి ఇవ్వగలవు. అయినా 12% అంచనా చాలా వాస్తవికమైన లక్ష్యం. 3) మూడో అంకె - 20 ఇది పెట్టుబడి కొనసాగించాల్సిన కాలం. కనీసం 20 ఏళ్లు పాటు సిప్‌ని నిరాటంకంగా కొనసాగించాలి. చక్రవడ్డీ ప్రభావం గరిష్టంగా పనిచేయాలంటే టైమ్ చాలా ముఖ్యం. సంవత్సరాలు పెరుగుతున్న కొద్దీ మీ మొత్తం సంపద మరింత వేగంగా పెరుగుతుంది.

వివరాలు 

రూ.కోటికి చేరే లెక్క 

ఒక ఉదాహరణగా చూసుకుంటే.. నెలకు రూ.11,000 చొప్పున 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేసినట్లయితే, 12% రాబడి అంచనాతో సుమారు రూ.1 కోటి పైగా కూడబెట్టుకోవచ్చు. ఈ 20 ఏళ్లలో మీ అసలు పెట్టుబడి మొత్తం రూ.26.4 లక్షలు మాత్రమే. మిగతా రూ.83.50 లక్షలు చక్రవడ్డీ ద్వారా వచ్చిన సంపద. ఇదే మీ మొత్తాన్ని కోటి దాటేలా చేస్తుంది. ఈ ఫార్ములా ఎందుకు పనిచేస్తుంది? ఈ సూత్రం పనిచేయడానికి ప్రధాన కారణం చక్రవడ్డీ శక్తి. మీరు పెట్టిన డబ్బుపై వచ్చిన రాబడిపై కూడా మళ్లీ రాబడి చేరడం వల్ల మీ పెట్టుబడి వేగంగా పెరుగుతుంది. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కూడా ఇది గణనీయంగా తగ్గిస్తుంది.

వివరాలు 

ఎవరికి ఉపయోగపడుతుంది? 

భవిష్యత్తులో పెద్ద లక్ష్యాల కోసం డబ్బు కూడబెట్టాలనుకునే వారందరికీ ఈ సూత్రం బాగా సరిపోతుంది. రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లల విద్య, ఇంటి కొనుగోలు.. ఏ లక్ష్యం అయినా దీన్ని అనుసరించొచ్చు. ముఖ్యంగా ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత ఎక్కువ లాభం.