CYIENT: సైయెంట్ చేతికి టావో డిజిటల్.. రూ.2,070 కోట్ల భారీ ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఇంజినీరింగ్ సేవల సంస్థ టావో డిజిటల్‌ను సైయెంట్ లిమిటెడ్ కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం సుమారు రూ.2,070 కోట్ల (218 మిలియన్ డాలర్లు) ఎంటర్‌ప్రైజ్ విలువతో అమెరికా కేంద్రంగా ఉన్న టావో డిజిటల్‌కు చెందిన 100 శాతం వాటాను సైయెంట్ సొంతం చేసుకోనుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు సైయెంట్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. అవసరమైన నియంత్రణ అనుమతులు పూర్తయ్యిన తర్వాత ఈ కొనుగోలు ప్రక్రియను ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తి చేయనున్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది.
వివరాలు
మరింత మెరుగైన సేవలందిస్తాం
ఈ ఒప్పందంతో సైయెంట్ తన కస్టమర్లకు 'ఏఐ-నేటివ్ డేటా' మరియు 'డిజిటల్ ప్రోడక్ట్ ఇంజినీరింగ్' సేవలను మరింత ఉన్నత స్థాయిలో అందించనుంది. తమకు ఉన్న మూడు దశాబ్దాల అనుభవానికి టావో డిజిటల్ యొక్క ఏఐ నైపుణ్యం తోడవడం ద్వారా ఆటోమోటివ్, హై-టెక్, హెల్త్-టెక్ రంగాల్లో సంస్థ స్థానం మరింత బలపడుతుందని సైయెంట్ సీఈఓ సుకమల్ బెనర్జీ పేర్కొన్నారు. సైయెంట్‌తో కలిసి మరింత మెరుగైన సేవలను అందించడానికి ఎదురుచూస్తున్నామని టావో డిజిటల్ సీఈఓ రాజ్‌కుమార్ వెలగపూడి తెలిపారు.