Page Loader
గో ఫస్ట్ విమానాల కోసం లీజుదార్లతో టాటా, ఇండిగో విడివిడిగా చర్చలు
గో ఫస్ట్ విమానాల కోసం లీజుదార్లతో టాటా, ఇండిగో విడివిడిగా చర్చలు

గో ఫస్ట్ విమానాల కోసం లీజుదార్లతో టాటా, ఇండిగో విడివిడిగా చర్చలు

వ్రాసిన వారు Stalin
May 10, 2023
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత వారం స్వచ్ఛంద దివాలా ప్రక్రియ కోసం దాఖలు చేసిన గో ఫస్ట్ కీలక విమానాలను దగ్గించుకునేందుకు దేశీయ దిగ్గజ విమానయాన సంస్థలు టాటా గ్రూప్, ఇండిగో ఆ సంస్థ లీజుదార్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గో ఫస్ట్ నుంచి ఎయిర్‌బస్ ఎస్‌ఈ విమానాలను కొనుగోలు చేయాలని లీజుదార్లతో టాటా గ్రూప్, ఇండిగో విడివిడిగా మాట్లాడుతున్నట్లు సమాచారం. గో ఫస్ట్ విమానయాన సంస్థ మే 12 వరకు అన్ని టిక్కెట్లను రద్దు చేసిన తర్వాత, తక్షణమే టిక్కెట్ల అమ్మకాన్ని నిలిపివేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్ ఇండియా, విస్తారా, ఎయిర్‌ఏషియా ఇండియా సంస్థలు టాటా ఆధీనంలో ఉన్నాయి. భారతదేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా ఇండిగోకు పేరుంది.

విమానం

ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్‌ల కోసం చర్చలు

ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్‌ల కోసం టాటా గ్రూప్, ఇండిగో దిల్లీ, ముంబైలోని విమానాశ్రయ నిర్వాహకులతో చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్ బర్గ్ నివదిక తెలిపింది. కొత్త ఎయిర్‌లైన్ అకాశ ఎయిర్‌తో సహా పలు సంస్థలు విమానాశ్రయ స్లాట్‌లపై ఆసక్తిని వ్యక్తం చేశాయని నివేదిక పేర్కొంది. గో ఫస్ట్ లీజుదార్లు 36 విమానాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ రెండు బడా కంపెనీలు చర్చలు జరపడంతో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. విమానయాన సంస్థపై ఎలాంటి ప్రతికూల చర్యలు తీసుకోకుండా డీజీసీఏని నిరోధించడంలో ట్రిబ్యునల్ జోక్యాన్ని గో ఫస్ట్ కోరింది. అలాగే ఈ దివాలా ప్రక్రియ ఉద్దేశ్యం ఎయిర్‌లైన్‌ను పునరుద్ధరించడమేనని ఎన్‌సీఎల్‌టీకి దాఖలు చేసిన పిటిషన్‌లో గో ఫస్ట్ ఎయిర్‌లైన్ తెలిపింది.