Loading...
TCS: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లపై నిఘా.. ఉద్యోగుల్లో ఆందోళన.. అసలు కారణమిదే..
టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లపై నిఘా.. ఉద్యోగుల్లో ఆందోళన.. అసలు కారణమిదే..

TCS: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లపై నిఘా.. ఉద్యోగుల్లో ఆందోళన.. అసలు కారణమిదే..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2026
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తీసుకున్న తాజా నిర్ణయం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగులకు కంపెనీ కేటాయించిన అధికారిక ల్యాప్‌టాప్‌లలో 'డిజిటల్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మానిటరింగ్' టూల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ఉద్యోగులు ఏయే అప్లికేషన్లు ఉపయోగిస్తున్నారు, వాటిపై ఎంత సమయం వెచ్చిస్తున్నారు వంటి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో ఈ విధానం డేటా భద్రత, సైబర్ సెక్యూరిటీ కోసం మాత్రమేనా? లేక ఉద్యోగుల పని తీరును నిశితంగా పరిశీలించేందుకా? అనే చర్చ మొదలైంది.

వివరాలు 

మానిటరింగ్‌పై టీసీఎస్ ఉద్యోగుల్లో ఆందోళన

సాధారణంగా ఐటీ, బీపీఎం రంగాల్లో ఉద్యోగుల పనితీరు, సిస్టమ్ వినియోగాన్ని అంచనా వేసేందుకు వివిధ రకాల మానిటరింగ్ టూల్స్‌ను సంస్థలు ఉపయోగిస్తుంటాయి.

అయితే టీసీఎస్ ఈ టూల్‌ను ఉద్యోగులకు ముందస్తుగా అధికారికంగా తెలియజేయకుండానే ఏర్పాటు చేసిందన్న వార్తలు ఆందోళనకు దారితీశాయి.

ఒకవైపు క్లయింట్లకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని భద్రంగా ఉంచేందుకు, డేటా లీకేజీలను నియంత్రించేందుకు ఇటువంటి టెక్నాలజీ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు ఉద్యోగులు ఎంతసేపు పనిచేస్తున్నారు, ఏ అప్లికేషన్లను ఎంతసేపు ఉపయోగిస్తున్నారు వంటి అంశాలను వివరంగా తెలుసుకునే అవకాశం ఉండటంతో వారి గోప్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వివరాలు 

యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుదలే లక్ష్యమా?

మానిటరింగ్ టూల్ ఉద్దేశం ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించడం కాదని,కంపెనీ సిస్టమ్‌లో అప్లికేషన్లు సమర్థంగా పనిచేస్తున్నాయా లేదా అన్నది తెలుసుకోవడమేనని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.

ఏదైనా అప్లికేషన్ తరచూ హ్యాంగ్ అవుతోందా? ఉద్యోగులకు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు ఏమిటి? సిస్టమ్ వినియోగ అనుభవం ఎలా ఉంది? వంటి అంశాలకు సంబంధించిన మెట్రిక్స్‌ను సేకరించడం ద్వారా క్లయింట్ ప్రాజెక్టులను మరింత సమర్థంగా నిర్వహించవచ్చని EIIRTrend సీఈఓ పారీఖ్ జైన్ పేర్కొన్నారు.

అయితే సాంకేతికంగా ఇటువంటి విధానం ఉపయోగకరమే అయినప్పటికీ, దాని గురించి ఉద్యోగులకు సరైన స్థాయిలో సమాచారం ఇవ్వకపోవడమే ప్రధాన సమస్యగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుదలే లక్ష్యమా?

స్పష్టమైన కమ్యూనికేషన్ లేకపోవడంతో ఉద్యోగులు దీనిని సాధారణ డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ టూల్‌గా కాకుండా తమపై నిఘా పెట్టే వ్యవస్థగా భావించే పరిస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

జెడ్‌స్కీలర్ భాగస్వామ్యంతో సంబంధం ఉందా?

కొన్ని నెలల క్రితం టీసీఎస్ సైబర్ సెక్యూరిటీ సంస్థ జెడ్‌స్కీలర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఈ భాగస్వామ్యంలో భాగంగా టీసీఎస్ 'వర్క్‌స్పేస్ ఎక్స్‌పీరియన్స్ స్టూడియో'ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

జీరో-ట్రస్ట్ సెక్యూరిటీ, వర్క్‌ప్లేస్ అబ్జర్వబిలిటీ, డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ మానిటరింగ్ వంటి ఫీచర్లను ఇందులో పొందుపరిచారు.

ప్రస్తుతం ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లలో ఏర్పాటు చేసిన మానిటరింగ్ టూల్ ఇదే సాంకేతికతకు సంబంధించినదా? అనే దానిపై మాత్రం టీసీఎస్ నుంచి అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు.

గతంలో కాగ్నిజెంట్ కూడా 'ప్రొహన్స్' వంటి ఉద్యోగుల మానిటరింగ్ టూల్స్‌ను ఉపయోగించిన విషయం చర్చకు వచ్చింది.

వివరాలు 

6 లక్షల మందికిపైగా ఉద్యోగులతో పెద్ద సవాల్

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 లక్షల మందికిపైగా ఉద్యోగులు ఉన్న టీసీఎస్ వంటి భారీ సంస్థలో ఇంత పెద్ద మొత్తంలో డేటాను సేకరించి,విశ్లేషించడం సంస్థకు పెద్ద ఆపరేషనల్ సవాల్‌గా మారే అవకాశం ఉంది.

ముఖ్యంగా క్లయింట్ల వర్చువల్ డెస్క్‌టాప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఉద్యోగులు పనిచేసే సందర్భంలో డేటా భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడటం కీలకం.

ఈ నేపథ్యంలో మానిటరింగ్ టూల్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ వెండర్ ఎవరు? ఉద్యోగుల నుంచి ఎలాంటి డేటాను సేకరిస్తున్నారు? ఆ సమాచారాన్ని కంపెనీలో ఎవరెవరు యాక్సెస్ చేయగలరు? వంటి కీలక ప్రశ్నలకు టీసీఎస్ సమాధానం ఇవ్వాల్సి ఉంది.

వివరాలు 

6 లక్షల మందికిపైగా ఉద్యోగులతో పెద్ద సవాల్

డేటా భద్రత కోసం తీసుకున్న చర్యే అయినప్పటికీ, ఉద్యోగులకు తగిన సమాచారం, స్పష్టత లేకపోతే గోప్యతపై అనుమానాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

మొత్తంగా టెక్నాలజీ ఆధారిత ఈ కొత్త పర్యవేక్షణ విధానం టీసీఎస్ ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతోంది.

ADVERTISEMENT