
జనరేటివ్ ఏఐలో ట్రైనింగ్ కోసం టీసీఎస్ పెట్టుబడులు.. లక్ష మంది ఉద్యోగులకు సాంకేతిక నైపుణ్య శిక్షణ
ఈ వార్తాకథనం ఏంటి
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లక్ష మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐ(ARTIFICIAL INTELLIGENCE)లో శిక్షణ ఇచ్చింది.
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను ఉపయోగించుకునే లక్ష్యంతో టీసీఎస్ ఉంది.
అయితే 250 కంటే ఎక్కువ ఉత్పాదక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అవకాశాలున్నా నేపథ్యంలో టీసీఎస్ ఈ సాంకేతికతను వినూత్న ఉత్పత్తులు, సేవల కోసం ఉపయోగించాలని యోచిస్తోంది.
ఉత్పాదక ఏఐ(Generative AI) పట్ల పెరుగుతున్న ఆసక్తి, ప్రాజెక్ట్‌లను ఆప్టిమైజ్ చేసేందుకు గల ఆపరేటింగ్ మోడల్‌లను మార్చేందుకు ఏఐ సామర్థ్యాన్ని కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ కే కృతివాసన్ నొక్కి చెప్పారు.
కంపెనీ Q2 ఆదాయాలను వెల్లడించిన సందర్భంగా ఉత్పాదక కృత్రిమ మేధస్సు (AI)లో గల అవకాశాలపై ఆయన తెలిపారు.
details
క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్సెస్, AI/ మెషిన్ లెర్నింగ్‌లో నిపుణత కోసం కృషి
వ్యక్తులు, కొత్త సాంకేతికతలపై పెట్టుబడుల పోటీని అధిగమించేందుకు, టీసీఎస్ తన వర్క్‌ఫోర్స్ , కొత్త టెక్నాలజీల్లో భారీగా పెట్టుబడి పెడుతోంది.
కంపెనీకి చెందిన దాదాపు లక్షమంది 'Generative-AI' కన్సల్టెంట్లు శిక్షణ పొందారు.ఇదే సమయంలో ప్రాంప్ట్ ఇంజనీర్లు వివిధ రంగాల్లోని క్లయింట్‌ల కోసం అనేక Gen-AI ప్రాజెక్ట్‌లలో పనిచేస్తున్నాని సీఓఓ ఎన్ గణపతి సుబ్రమణ్యం అన్నారు.
ఉత్పాదక AIలో బలమైన పునాదిని ఏర్పాటు చేసి, శ్రామిక శక్తికి అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉండేలా తీర్చిదిద్దేందుకే టీసీఎస్ వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెడుతోందన్నారు.
ఐటీ దిగ్గజం, ఏఐలో వృద్ధిని పెంచుకునేందుకు AI Cloud కంప్యూటింగ్ యూనిట్ ను జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రారంభించింది.
క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్సెస్, AI/ మెషిన్ లెర్నింగ్‌లో నిపుణత కోసం కృషి చేస్తోంది.