Samsung: నిరవధిక సమ్మెను ప్రకటించిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఉద్యోగులు
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కార్మిక సంఘానికి చెందిన ఉద్యోగులు బుధవారం నిరవధిక సమ్మెను ప్రకటించారు. దక్షిణ కొరియాలోని అతిపెద్ద కంపెనీకి చెందిన ఈ ఉద్యోగులు అధిక వేతనాలు, ఇతర ప్రయోజనాలను డిమాండ్ చేస్తున్నారు. 'నేషనల్ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ యూనియన్'కి చెందిన వేలాది మంది సభ్యులు సోమవారం మూడు రోజుల తాత్కాలిక సమ్మెను ప్రారంభించారు. చర్చలకు యాజమాన్యం సుముఖంగా లేదని ఆరోపిస్తూ బుధవారం నిరవధిక సమ్మెను ప్రకటిస్తున్నట్లు యూనియన్ ప్రకటించింది. "మా విజయంపై మాకు నమ్మకం ఉంది" అని యూనియన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా, సమ్మె కారణంగా ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం ఉండదని, చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తెలిపింది.