LOADING...
Inflation: ధరల నియంత్రణ ఖర్చు ఎంత? భారత్, అమెరికా, బ్రిటన్‌ అసలు పరిస్థితి ఏంటి?
ధరల నియంత్రణ ఖర్చు ఎంత? భారత్, అమెరికా, బ్రిటన్‌ అసలు పరిస్థితి ఏంటి?

Inflation: ధరల నియంత్రణ ఖర్చు ఎంత? భారత్, అమెరికా, బ్రిటన్‌ అసలు పరిస్థితి ఏంటి?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 27, 2026
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల ప్రభావంతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లను దాటడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మళ్లీ ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగింది. గత నాలుగేళ్లలోనే అత్యధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి కష్టపడిన సెంట్రల్ బ్యాంకులు ఇప్పుడు మరోసారి పెద్ద సవాల్‌ను ఎదుర్కొంటున్నాయి. 2022లో కోవిడ్ ప్రభావం ఇంకా తగ్గకముందే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, సరఫరా లోపాలు, ప్రభుత్వ భారీ ఖర్చులు కలిసి ప్రపంచవ్యాప్తంగా ధరలను పెంచాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్, బ్రిటన్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, భారత రిజర్వ్ బ్యాంక్.. ఈ మూడు సంస్థలు కూడా వడ్డీ రేట్లను పెంచుతూ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రయత్నించాయి.

వివరాలు 

సాక్రిఫైస్ రేషియో

2025 నాటికి ధరలు కొంతవరకు నియంత్రణలోకి వచ్చినా, ఆ ప్రయాణం సులభం కాలేదు. ఆర్థిక నిపుణులు దీనిని "సాక్రిఫైస్ రేషియో" అనే ప్రమాణంతో కొలుస్తారు. అంటే ద్రవ్యోల్బణాన్ని ఒక శాతం తగ్గించేందుకు ఆర్థిక వ్యవస్థ ఎంత మేర నష్టాన్ని భరించిందో సూచించే ప్రమాణమే ఇది. అమెరికాలో 2022లో ద్రవ్యోల్బణం 9.1% వరకు చేరింది. దీనిని తగ్గించేందుకు ఫెడ్ 2022 మార్చి నుంచి 2023 జూలై వరకు వరుసగా 11సార్లు వడ్డీ రేట్లు పెంచి 5.25% నుంచి 5.50% వరకు తీసుకెళ్లింది. అయితే ఆశ్చర్యకరంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లలేదు. సరఫరా సమస్యలు త్వరగా సద్దుమణగడం, ఇంధన ధరలు తగ్గడం, వినియోగం బలంగా ఉండటం వల్ల ద్రవ్యోల్బణం తక్కువ ఖర్చుతోనే తగ్గింది.

వివరాలు 

2023లో మాంద్యంలోకి బ్రిటన్

ఇక బ్రిటన్ పరిస్థితి మాత్రం కాస్త భిన్నంగా మారింది. 2021 డిసెంబర్ నుంచే రేట్లు పెంచడం ప్రారంభించినా ద్రవ్యోల్బణం తగ్గలేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్‌లో గ్యాస్ ధరలు భారీగా పెరగడం,కార్మికుల కొరత వల్ల జీతాలు పెరగడం అన్నికలిసి పరిస్థితిని మరింత క్లిష్టం చేశాయి. 0.1% నుంచి 5.25%వరకు రేట్లు పెంచిన తర్వాత కూడా 2023 చివర్లో బ్రిటన్ మాంద్యంలోకి జారుకుంది. నిరుద్యోగం కూడా 2025 నాటికి 5.2%కు పెరిగింది. ఇంకా 2026లో కూడా ద్రవ్యోల్బణం లక్ష్యానికి మించి కొనసాగుతోంది. భారత్‌లో ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి వరకు రిపో రేటును 4% నుంచి 6.5% వరకు పెంచింది. తరువాత 2025 వరకు అదే స్థాయిలో ఉంచి, ఆపై కొంత తగ్గించింది.

Advertisement

వివరాలు 

2026 మార్చిలో రూపాయి 95.22గా నమోదు 

దేశ ఆర్థిక వృద్ధి 8% నుంచి 6.5%కు తగ్గినా, మాంద్యం మాత్రం రాలేదు.రిటైల్ ద్రవ్యోల్బణం 2025 నాటికి 2% దగ్గరికి చేరింది. అయితే భారత్‌లో ఆహార పదార్థాల ధరలు మొత్తం ద్రవ్యోల్బణంలో పెద్ద భాగం కావడం వల్ల వడ్డీ రేట్ల ప్రభావం పూర్తిగా కనిపించదు. ఇంకా ఒక ముఖ్య అంశం రూపాయి విలువ పడిపోవడం. 2026 మార్చిలో రూపాయి డాలర్‌కు 95.22 వరకు పడిపోయింది. రూపాయి బలహీనమైతే దిగుమతులు ఖరీదవుతాయి, దాంతో ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఆర్బీఐ రేట్లు తగ్గించడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఒకవైపు రేట్లు తగ్గిస్తే రూపాయి మరింత పడిపోవచ్చు, మరోవైపు పెంచితే వృద్ధి మందగించే ప్రమాదం ఉంది.

Advertisement

వివరాలు 

చమురు ధరల పెరుగుదలతో ముందున్న కొత్త సవాళ్లు

మొత్తంగా చూస్తే మూడు దేశాలు ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో విజయం సాధించినా, వాటి ప్రయాణం, ఖర్చు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. అమెరికా తక్కువ నష్టంతో ఈ సమస్యను ఎదుర్కొంది. బ్రిటన్ భారీ నష్టాన్ని భరించింది. భారత్ మాత్రం మాంద్యాన్ని తప్పించుకుని మధ్యస్థ మార్గంలో సాగింది. అయితే తాజా చమురు ధరల పెరుగుదలతో మళ్లీ కొత్త సవాళ్లు ముందున్నాయి.

Advertisement