Loading...
Amazon Great Indian Festival 2026 : అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ తేదీ వచ్చేసింది.. ఎప్పటి నుంచి అంటే?
అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ తేదీ వచ్చేసింది.. ఎప్పటి నుంచి అంటే?

Amazon Great Indian Festival 2026 : అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ తేదీ వచ్చేసింది.. ఎప్పటి నుంచి అంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2026
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

పండగ సీజన్‌లో షాపింగ్ చేసేందుకు ఎదురుచూస్తున్న వారికి అమెజాన్ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026' (Amazon Great Indian Festival 2026)సేల్ తేదీని ప్రకటించింది. అక్టోబర్ 8 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. మరో ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే 'బిగ్ బిలియన్ డేస్ 2026'(Big Billion Days 2026)సేల్ తేదీని ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ సేల్ అక్టోబర్ 9న ప్రారంభం కానుంది. దీంతో పండగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ కంటే ఒక్కరోజు ముందుగానే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్లకు మాత్రం అక్టోబర్ 8 నుంచే బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభమవుతుంది.

వివరాలు

ఎస్‌బీఐ కార్డులతో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు హోల్డర్లకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించనున్నట్లు అమెజాన్ తన మైక్రోసైట్‌లో పేర్కొంది.

అలాగే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు 10 శాతం వరకు అదనపు ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

అయితే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎప్పటివరకు కొనసాగుతుందనే విషయాన్ని అమెజాన్ ఇంకా వెల్లడించలేదు.

వివరాలు

పలు రకాల డీల్స్

సేల్ సందర్భంగా కస్టమర్ల కోసం వివిధ రకాల డీల్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అమెజాన్ తెలిపింది.

ఇందులో భాగంగా 8 PM డీల్స్, బ్లాక్‌బస్టర్ డీల్స్, టాప్ 100 డీల్స్, మెగా డీల్స్ పేరుతో ప్రత్యేక ఆఫర్లు ఉండనున్నాయి.

సేల్ తేదీ దగ్గర పడే కొద్దీ మరిన్ని ఆఫర్లు, డిస్కౌంట్లకు సంబంధించిన వివరాలను అమెజాన్ వెల్లడించనుంది.

దీంతో పండగ సీజన్ షాపింగ్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది.

ADVERTISEMENT