Stock Market: కుదేలైన స్టాక్ మార్కెట్.. ఇవాళ అత్యధికంగా నష్టపోయిన షేర్లు ఇవే!
ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీపావళి పండుగ సమీపించగా, కీలక సూచీలు - బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 - క్షీణించడం గమనార్హం. ఉదయం 10.35 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 259 పాయింట్లు తగ్గి 80,109.44 వద్ద, నిఫ్టీ 70.65 పాయింట్ల నష్టంతో 24,396.20 వద్ద కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ సూచీ 503 పాయింట్ల నష్టంతో 51,820 వద్ద ఉన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 మాత్రం లాభాల బాటలో పయనించి 335 పాయింట్ల వృద్ధితో 56,586 వద్ద ఉంది. ఈరోజు ట్రేడింగ్‌లో BSE సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 20 లెడ్‌లో ఉన్నాయి.
ఆసియా మార్కెట్ల పరిస్థితి
సిప్లా (4 శాతం క్షీణత), శ్రీరామ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ టాప్ 5 నష్టపోయిన స్టాక్స్. లాభాల్లో ఉన్న టాప్ 5 స్టాక్స్‌లో అదానీ ఎంటర్‌ప్రైజ్, భారత్ ఎయిర్ టెల్, అదానీ పోర్ట్స్, టాటా కన్స్యూమర్స్, విప్రో ఉన్నాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో మిశ్రమ ధోరణులు కనిపిస్తున్నాయి. దక్షిణ కొరియా కోస్పి 0.52 శాతం తగ్గగా, జపాన్ నిక్కీ 225 వాల్ స్ట్రీట్‌లో లాభాలను నమోదు చేసింది. బ్యాంక్ ఆఫ్ జపాన్ పాలసీ సమావేశం ప్రారంభమైంది. మంగళవారం, సెన్సెక్స్ 363.99 పాయింట్లు పెరిగి 80,369.03 వద్ద ముగియగా, నిఫ్టీ 50 127.70 పాయింట్ల లాభంతో 24,466.85 వద్ద స్థిరపడింది.