
Gold Rates: అంచనాలకు మించి పెరిగిన బంగారం ధర.. సామాన్యులు కొనడం కష్టమే!
ఈ వార్తాకథనం ఏంటి
MCX లో డిసెంబర్ ఫ్యూచర్స్ బంగారం ధరలు 10 గ్రాముల ధర రరూ.1,20,900కి చేరుకుని సరికొత్త రికార్డును సృష్టించింది. ఉదయం 11:45 నాటికి 10 గ్రాముల కోసం గోల్డ్ 0.22% పెరుగుతూ రూ.1,20,510 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో MCX సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ 1 కిలోకు 0.03శాతం తగ్గి రూ.1,47,475 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ గోల్డ్ ధరలు కూడా US లో ఆర్థిక, రాజకీయ అస్థిరతల కారణంగా రికార్డు స్థాయికి చేరాయి. US షట్డౌన్ 7వ రోజు చేరడంతో ఉద్యోగ నష్టం, ఆర్థిక అవాంతరాలు పెరుగుతున్నాయి. రీటన్స్ సమాచారం ప్రకారం, షట్డౌన్ కారణంగా సుమారు $1.7 ట్రిలియన్ నిధులు ఆగిపోయాయి,
Details
ఇన్వెస్టర్లు పరిశీలిస్తున్న అంశాలివే
అంతకుముందు, మార్కెట్లు ఈ ఏడాది అక్టోబర్, డిసెంబర్‌లో US ఫెడ్ మరో 25 బేసిస్ పాయింట్లు రేట్ కట్ చేస్తుందని అంచనా వేస్తున్నాయి. FOMC మీటింగ్ నిమిషాలు ఫెడ్ చైర్ ప్రసంగం చైనా పండుగ తర్వాత పునఃప్రారంభం US షట్డౌన్ నవీకరణలు దేశీయ మార్కెట్‌లో గోల్డ్ డిమాండ్ ఈ ఏడాది గోల్డ్ డిమాండ్ రిటైల్ ఇన్వెస్టర్లలో 55శాతం పెరిగింది. గ్లోబల్ భద్రతా పరిస్థితులు, టారిఫ్ అస్థిరత, డాలర్ బలహీనత, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు ప్రధాన కారణాలు. గోల్డ్, సిల్వర్ ETFS లో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.
Details
MCX కీలక లెవల్స్
గోల్డ్ సపోర్ట్: ₹1,19,100 - ₹1,18,000 గోల్డ్ రెసిస్టెన్స్: ₹1,21,000 - ₹1,22,200 సిల్వర్ సపోర్ట్: ₹1,46,200 - ₹1,45,000 సిల్వర్ రెసిస్టెన్స్: ₹1,48,800 - ₹1,50,000 మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం US షట్డౌన్, ఫ్రాన్స్‌లో రాజకీయ కలకలం వల్ల గ్లోబల్ ఆర్థిక అస్థిరత పెరిగింది. రిటైల్, ఇనిస్టిట్యూషనల్ బాయింగ్, ఫెడ్ రేట్ కట్ అంచనాలు ధరలను పెంచుతున్నాయి. MCX లో గోల్డ్ సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. US ఫెడ్ రేట్ కట్స్, అంతర్జాతీయ అస్థిరత, దేశీయ డిమాండ్ మద్దతు ఇస్తున్నాయి. సిల్వర్ కూడా బలమైన మద్దతుతో కొనసాగుతోంది.