Page Loader
Gold Prices: ఫిబ్రవరిలో ఆకాశానికి చేరిన బంగారం ధర.. గ్రామ్ రేట్ ఎంతో తెలుసా?
ఫిబ్రవరిలో ఆకాశానికి చేరిన బంగారం ధర.. గ్రామ్ రేట్ ఎంతో తెలుసా?

Gold Prices: ఫిబ్రవరిలో ఆకాశానికి చేరిన బంగారం ధర.. గ్రామ్ రేట్ ఎంతో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2025
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిబ్రవరి నెలలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 20న 22 క్యారట్ల బంగారం ధర గ్రాముకు మరింత పెరిగింది. 24 క్యారట్ల బంగారం ధర రూ. 8804గా ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వచ్చే నెల నుంచి ధరలు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభంతో బంగారం ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జనవరి నెలలో కొంత స్థిరంగా ఉన్న బంగారం ధరలు, ఫిబ్రవరిలో మాత్రం భారీగా పెరిగాయి.

Details

 పెరుగుదలకు కారణాలివే 

ఫిబ్రవరి నెల ప్రారంభం నుంచే బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు, సాధారణ ప్రజలు ఈ పెరుగుదలపై ఆందోళన చెందుతున్నారు. ఈ పెరుగుదల వెనుక పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా: అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల పెరుగుదల ముడి వసతుల కొరత ఆర్థిక సంక్షోభ ప్రభావం డాలర్ మారకంలో మార్పులు భారత మార్కెట్‌పై ప్రభావం భారతదేశంలో బంగారం ధర పెరగడం ఉత్పత్తిదారులు, వ్యాపారులు, సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. బంగారాన్ని గృహ వినియోగం కోసం కొనుగోలు చేసే వారు, పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ధరలు పెరగడం గమనార్హం.

Details

ఫిబ్రవరి నెలలో బంగారం ధరల మార్పులు 

ఫిబ్రవరి 18 22 క్యారట్ల బంగారం - గ్రాముకు రూ. 7970 24 క్యారట్ల బంగారం - గ్రాముకు రూ. 8695 ఫిబ్రవరి 19 22 క్యారట్ల బంగారం - రూ. 8035(+రూ. 65) 24 క్యారట్ల బంగారం - రూ. 8765 (+రూ. 70) ఫిబ్రవరి 20 22 క్యారట్ల బంగారం- రూ. 8070(+రూ. 35) 24 క్యార్ట్ల బంగారం- రూ. 8804(+రూ. 39) భవిష్యత్‌లో ధరలు తగ్గుతాయా? బంగారం ధరలు వచ్చే నెలలో స్థిరంగా మారే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గితే, ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగారం ధరలు ఎలా మారతాయన్నదానిపై మార్కెట్ నిపుణులు ప్రత్యేకంగా గమనిస్తున్నారు.