Page Loader
Insurance: వర్షాకాలం వచ్చేసింది.. మీ కారుకు సరైన ఇన్సూరెన్స్ కవరేజీ ఉందా?
వర్షాకాలం వచ్చేసింది.. మీ కారుకు సరైన ఇన్సూరెన్స్ కవరేజీ ఉందా?

Insurance: వర్షాకాలం వచ్చేసింది.. మీ కారుకు సరైన ఇన్సూరెన్స్ కవరేజీ ఉందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2025
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

వర్షాకాలం రాగానే కారు యజమానుల కోసం కొత్త సమస్యలు మొదలవుతాయి. వర్షాలు, వరదలు, బురద, నీటి నిల్వలు... ఇవన్నీ కేవలం రహదారులపై కాకుండా, వాహనాలపై కూడా ప్రభావం చూపుతాయి. పల్లె ప్రాంతాల్లో నివసించే వారికి ఇది రోజువారీ సవాలుగా మారుతుంది. ముఖ్యంగా ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో వర్షాల తర్వాత రోడ్లు చిన్న చిన్న నదులా మారిపోతున్న దృశ్యాలు ఇటీవల మనం చూశాం. ఇలాంటి పరిస్థితులు కారు ఇంజిన్‌లను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. భారీ వర్షాలు, గాలివానలు చెట్లు లేదా స్తంభాలను కూల్చవేసే అవకాశముంది. ఇది వాహనాలకు డెంట్లు, కంటె పెయింట్ పీలవడం, గాజులు పగిలిపోవడం వంటి నష్టాలకు దారి తీస్తుంది.

Details

 బీమా కవరేజీ అందే పరిధిని తెలుసుకోండి

సమగ్ర కారు బీమా పాలసీలు విస్తృతంగా కవర్ అందించినప్పటికీ, వాటి పరిమితులు తెలుసుకోవడం అవసరం. వర్షాకాలంలో సాధారణంగా జరిగే నీటి చొరబడటం వల్ల ఇంజిన్ దెబ్బతినే ప్రమాదం ఉంది. కానీ ఈ నష్టం చాలా పాలసీల్లో కవర్ అవదు. అంతేగాక, వృద్ధాప్యం వల్ల లేదా ముందు నుంచే ఉన్న నష్టాలకు, టైర్లు, ట్యూబ్‌లు పాడవడానికిగానీ క్లెయిమ్ చెల్లించకపోవచ్చు. అసంపూర్ణ డాక్యుమెంటేషన్ కూడా క్లెయిమ్ తిరస్కరణకు కారణమవుతుంది.

Details

తప్పనిసరిగా తీసుకోవలసిన యాడ్-ఆన్ కవరేజీలు

వర్షాకాలం ప్రమాదాలను ఎదుర్కొనేందుకు సాధారణ పాలసీతో పాటు ఈ ప్రత్యేక యాడ్-ఆన్‌లను బీమాలో చేర్చుకోవడం ఉత్తమం జీరో డిప్రిసియేషన్ కవర్ ఈ కవర్ వాహన భాగాలపై తరుగుదల (depreciation) ప్రభావాన్ని లెక్కలోకి తీసుకోదు. నీటి నిల్వ వల్ల బాడీ ప్యానెల్‌లు దెబ్బతింటే పూర్తి క్లెయిమ్ పొందొచ్చు. ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ నీటి ప్రవేశం, ఆయిల్ లీకేజీ వంటి వర్ష సంబంధిత సమస్యల వల్ల ఇంజిన్ దెబ్బతింటే దీనివల్ల కలిగే ఖర్చులు కవర్ చేస్తుంది. ఇది ఖరీదైన మరమ్మత్తుల నుంచి రక్షిస్తుంది. రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (RSA) వర్షాకాలంలో బ్రేక్‌డౌన్‌లు సాధారణం. ఈ కవర్ ద్వారా టోయింగ్, ఫ్యూయల్ డెలివరీ, మైనర్ రిపేర్స్, అవసరమైతే ఆశ్రయం వంటి సేవలు లభిస్తాయి.

Details

 కన్స్యూమబుల్స్ కవర్ 

ఇంజిన్ ఆయిల్, స్క్రూస్, బోల్ట్స్ వంటి వినియోగ పదార్థాల మార్పుకు అయ్యే ఖర్చును కవర్ చేస్తుంది. టైర్ ప్రొటెక్టర్ కవర్ చెడ్డ రోడ్లు, వరదల వల్ల టైర్లు పాడవుతుంటే ఈ యాడ్-ఆన్ వాటిని కవర్ చేస్తుంది. ఫ్లడ్ అసిస్టెన్స్ కవర్ వరదల ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రత్యేక యాడ్-ఆన్ ద్వారా వరదల వల్ల కారుకు జరిగే నష్టాన్ని సమర్థవంతంగా కవర్ చేసుకోవచ్చు.

Details

సరైన నిర్ణయం తీసుకోండి 

వర్షాకాలం రాగానే కారుకు బలమైన రక్షణ అవసరం. కేవలం సాధారణ బీమాతో సరిపెట్టుకోకుండా, మీ ప్రాంతానికి తగిన యాడ్-ఆన్‌లు ఎంపిక చేసుకోవాలి. ఇందువల్ల క్లెయిమ్ తిరస్కరణల సమస్యను నివారించడమే కాకుండా, అనూహ్య పరిస్థితుల్లోనూ మనశ్శాంతిని పొందవచ్చు. మీరు కొత్త పాలసీ తీసుకోవాలనుకుంటున్నా, లేదా ఇప్పటికే ఉన్న బీమాను రిన్యూయ్ చేయాలనుకుంటున్నా - ఈ యాడ్-ఆన్‌లు తప్పనిసరిగా పరిగణించండి.